Anna Hazare begins fast for Lokpal సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహారదీక్ష

Activist anna hazare goes on hunger strike from today for lokpal

Hunger strike, Anna Hazare strike, Anna Hazare Lokpal, Anna Hazare Lokayukta, Anna Hazare Swaminathan recommendations, Anna Hazare Ralegan Siddhi, Devendra Fadnavis, Ahmednagar, Maharashtra

Social activist Anna Hazare launched a hunger strike over the delay in appointment of a Lokpal at the Centre and the passage of the Lokayukta Act in Maharashtra at his village Ralegan Siddhi in Maharashtra’s Ahmednagar district.

సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహారదీక్ష

Posted: 01/30/2019 12:59 PM IST
Activist anna hazare goes on hunger strike from today for lokpal

అవినీతి రహిత భారత నిర్మాణ స్వప్నాకారుడు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. లోక్‌పాల్‌, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ ఇవాళ ఉదయం ఆయన మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్షకు పూనుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందుకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నరేంద్రమోడీ ప్రభుత్వం నేరవేర్చలేదని ఆయన అక్షేపించారు.

నిరాహారదీక్షకు పూనుకునేందుకు ముందు ఆయన తన నిరాహార దీక్ష ఏ ఒక్క వ్యక్తికి, పక్షానికి, పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నది కాదని, భారతీయ సమాజం, దేశం ఉన్నతి, మంచిని కాంక్షిస్తూ చేస్తున్నదేనని చెప్పారు. లోక్‌పాల్‌ బిల్లు 2013లోనే పార్లమెంటులో ఆమోదం పొందినా.. అటు కేంద్రంలో లోక్ పాల్, ఇటు రాష్ట్రాలలో లోకాయుక్తాలను అచరణలో పెట్టని కారణంగా, ఆ వ్యవస్థలను ఏర్పాటు చేయని కారణంగా అన్నాహజారే నిరసనను వ్యక్తం చేస్తూ దీక్షకు పూనుకున్నారు.

లోక్ పాల్, లోకాయుక్తాల వ్యవస్థల నియామించకపోవడంపై ఏ పార్టీ పట్టించుకోవట్లేదని హజారే అసహనం వ్యక్తం చేశారు. లోక్‌పాల్‌, లోకాయుక్తలను ఏర్పాటుచేసే వరకూ నిరాహార దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. అయితే అన్నా దీక్ష నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తమ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లోకాయుక్త పరిధిలోకి తీసుకువస్తూ అదేశాలు జారి చేసింది. అన్నాహజారే దీక్షను విరమింపజేసేందుకు అటు ప్రభుత్వానికి, ఇటు అన్నాకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్.. అన్నా డిమాండ్లనింటినీ నెరవేరుస్తామని చెప్పినా.. అన్నా దీక్షకు పూనుకున్నారు.

స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని.. రైతుల పెట్టుబడులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధరల లభించాలని అన్నాహాజరే డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని, ఇక కేంద్రంలో లోకాయుక్తను కూడా నియమించాలని డిమాండ్ ముందునుంచి వస్తున్నదే. వీటి ద్వారా దేశంలో అవినీతి తగ్గిపోయి.. ప్రజలకు మేలు జరుగుతుందని అన్నా భావిస్తున్నారు.

ఇటీవల హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హజారే నిరాహార దీక్ష గురించి ప్రకటించారు. ‘2014లో అవినీతి రహిత ప్రభుత్వం అనే నినాదంతో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన లోక్‌పాల్‌ బిల్లును అమలు చేస్తారని, తద్వారా దేశంలో అవినీతికి కళ్లెం పడుతుందని ఆశించా. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రభుత్వం కావాలనే దీన్ని ఆలస్యం చేస్తూ వస్తోంది. అందుకే నేను మరోసారి దీక్షకు దిగుతున్నా’ అని ఆ సందర్భంలో హజారే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles