colony on CM grandson nara devansh name వారసత్వం: నారా దేవాన్ష్ పేరున కాలనీ..!

Colony appears on chief minister grandson nara devansh name

colony on CM Grand son name, colony on nara devansh name, NTR GruhaKalpa, Independent Houses, Nara Bhuvaneshwari, nara devansh colony, gudiwada, komaravolu, nara chandrababu naidu, krishna district, andhra pradesh

A colony constructed with the Government funds under NTR GruhaKalpa Scheme in kamaravolu of gudiwada, krishna district is in the news after it being named on CM Grand son Nara Devansh.

సొమ్ము ప్రజలది.. పేరు మనవడిదా..? దేవాన్ష్ పేరున కాలనీ.!

Posted: 01/28/2019 03:57 PM IST
Colony appears on chief minister grandson nara devansh name

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరున కాలనీ వెలువడటం రాష్ట్ర రాజకీయాలలో సంచలనాలకు తెరతీసింది. కృష్ణా జిల్లా గుడివాడలోని కొమరవోలులో వెలసిన ఈ కాలనీ దేవాన్ష్ కాలనీగా నామకరణం చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రజానిధులతో నిర్మించిన కాలనీకి దేవాన్ష్ పేరును పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన ముఖ్యమంత్రి.. దానిని తన రాజకీయా వారసత్వంగా స్వాగతించి ప్రారంభోత్సవం చేయడం విమర్శలకు దారితీస్తోంది.

వివరాల్లోకి వెళ్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద ఇళ్లు లేని పేదలకు ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు కేటాయించారు అధికారులు. అయితే తమకు ఇళ్లను అందించినందుకు సంతోషంగా స్థానిక లబ్దిదారులందరూ కలిసి టీడీపీ ప్రభుత్వానికి రిటర్న్ గిప్ట్ ఇచ్చారు. అదేంటంటే ఆ కాలనీకి ముఖ్యమంత్రి మనవడు నారా దేవాన్ష్ కాలనీగా నామకరణం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. అ కాలనీ బోర్డును, కాలనీని చంద్రబాబ సతీ సమేతంగా వెళ్లి ప్రారంభించారు.

ఇదే విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో నిర్మించే కాలనీలకు జాతీయ, రాష్ట్రీయ నేతల పేర్లో లేదా ప్రముఖుల పేర్లో పెడితే బాగుంటుందని కానీ.. ఇలా అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారైన తన మనవడి పేరును పెట్టడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నలు కురిపిస్తున్నారు. వారసత్వ రాజకీయాలపై పెదవి విరిచే చంద్రబాబు.. తన మనవడు దేవాన్స్ తన రాజకీయ వారసుడని చాటడానికి ఎందుకు తొందరపడుతున్నారని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అయితే కొమరవోలు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 2015లో దత్తత తీసుకున్నారు. దీంతో స్తానికులు చంద్రబాబు దంపతులపై ప్రేమతో ఇలా చేశారన్న వాదనలు తెరపైకి వస్తున్నా.. అభంశుభం తెలియని పసివాడిని అప్పుడే రాజకీయ విమర్శలకు దింపడం సబబు కాదని సొంతపార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్న విషయం. కనీసం కాలనీ బోర్డును చూసైనా చంద్రబాబు అక్షేపించాల్సిందని మరికొందరు వాదిస్తున్నారు.

మరోవైపు ఈ కాలనీకి ముఖ్యమంత్రి మనువడి పేరు పెట్టడంపై వైసీపీ మండిపడుతోంది. ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీకి ముఖ్యమంత్రి మనవవడి పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటున్నారు. గ్రామంలో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరిగితే.. తాము చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR GruhaKalpa  nara devansh colony  komaravolu  chandrababu  andhra pradesh  

Other Articles