Bengal govt grants permission for Amit Shah's chopper అమిత్ షా చాఫర్ కు మమత సర్కార్ అనుమతి.!

Bjp cries foul as bengal govt grants permission for amit shah s chopper

west bengal, ravi shankar prasad, Mamata Banerjee, Amit Shah, Hotel Golden Park, Narayanpur, Malda airport, Malda, Politics

After refusing to allow BJP president, Amit Shah's helicopter to land citing safety issues, the West Bengal government has now given permission to use the helipad at the ground opposite to Hotel Golden Park in Malda on January 22

అమిత్ షా చాఫర్ కు మమత సర్కార్ అనుమతి.!

Posted: 01/21/2019 12:29 PM IST
Bjp cries foul as bengal govt grants permission for amit shah s chopper

పశ్చిమ బెంగాల్ లోని మమతా సర్కార్ ఇప్పటికే కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వశక్తులను ఒడ్డుతూ.. బీజేపి వ్యతిరేక కూటములను ఒక్కటిగా చేసి.. వారితో భారీ బహిరంగసభను కూడా ఏర్పాటు చేసింది. బీజేపి ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న దీదీ.. మరోమారు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు జలక్ ఇచ్చారు. అమిత్ షా రథయాత్ర పేరుతో తమ రాష్ట్రంలోకి రావడాన్ని అడ్డుకున్న మమతా బెనర్జి.. ఆయనను సర్వోన్నత న్యాయస్థానం వెళ్లి అక్కడ కూడా ఎదురుదెబ్బ తినేలా చేశారు.

అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ర్యాలీలను నిర్వహించుకునేందుకు సమాయత్తమైన అమిత్ షా కు దీదీ సర్కార్ మళ్లీ జలక్ ఇచ్చింది. స్వైన్ ఫ్లూ జ్వరంతో బాధపడిన ఆయన కోటుకున్న తరువాత ఆయన పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ చేసి.. అక్కడ నుంచి ర్యాలీలను ప్రారంభించాలని నిర్ణయించారు. మంగళవారం ఆయన ఉత్తర్ బెంగాల్ ప్రాంతంలోని మల్దాలో ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ కోసం అమిత్ షా విమానంలో కోల్ కతాకు వచ్చి.... అక్కడి నుంచి హెలికాప్టర్ లో మాల్దా వెళ్లేలా రాష్ట్ర బీజేపీ నేతలు రూట్ మ్యాప్ వేశారు.

అయితే బీజేపి మాండ్యా జిల్లా కలెక్టర్ కు ఈ మేరకు తమ రూట్ మ్యాప్ ను పంపగా, ఆయన మాల్దా విమానాశ్రయంలో అమిత్ షా హెలికాప్టర్ దింపేందుకు అనుమతిని నిరాకరించింది మమతా బెనర్జీ సర్కార్. ఈ మేరకు పీడబ్ల్యూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం... మాల్దా హెలిప్యాడ్ లో హెలికాప్టర్ దిగే పరిస్థితి లేదని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ తెలిపారు. హెలిప్యాడ్ వద్ద ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి ఉన్నాయని చెప్పారు. తాత్కాలిక హెలిప్యాడ్ లో హెలికాప్టర్ దిగడం కూడా సురక్షితం కాదని తెలిపారు. ఈ కారణాల వల్ల మాల్దాలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతించబోమని స్పష్టం చేశారు.

అయితే దీనిపై బీజేపి శ్రేణులు మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఛాపర్ లను అనుమతిస్తూ తమ ఛాపర్లను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపి రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించారు. దీంతో ఆమిత్ షా కోల్ కతా నుంచి రోడ్డు మార్గం ద్వారానే అమిత్ షా మాల్దాకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇక ఈ విషయమై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా స్పందించిన క్రమంలో మమత ప్రభుత్వం ఎట్టకేలకు అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతించారు.

అయితే ఇందులో కూడా ఓ మెలిక పెట్టారు. మాల్దా విమానాశ్రయంలో అమిత్ షా ప్రయాణించే ఛాపర్ ను ల్యాండింగ్ కు నిరాకరిస్తూనే.. అదే సమయంలో మాల్దా జిల్లా నారాయణపూర్ లోని హెటోల్ గోల్డన్ పార్క్ ఎదురుగా వున్న స్థలంలో ల్యాండింగ్ చేసుకోవచ్చని అనుమతించారు. దీంతో బీజేపి శ్రేణులు మమతాబెనర్జీ సర్కార్ పై మండిపడుతున్నారు. బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడ్ని ర్యాలీకి మమతా బెనర్జీ ప్రభుత్వం ఆటంకాలను ఏర్పర్చుతున్నారని ఇది సహేతుకం కాదని కూడా విమర్శలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles