MacKenzie Could Become Richest Woman విడాకులతో.. ప్రపంచంలోని ఐశ్వరవంతుల జాబితాలోకి..!

Amazon chief jeff bezos may lose world s richest tag after divorce

amazon, Amazon CEO Jeff Bezos, Jeff Bezos, MacKenzie, Jeff Bezos divorce, MacKenzie divorce, jeff Bezos mackenzie divorce, crime

when the world's richest Amazon couple formally announced they would divorce after a long separation, the 48-year-old MacKenzie, a novelist, is likely to become the richest woman in the world.

విడాకులతో.. ప్రపంచంలోని అత్యంత సంపన్నవంతుల జాబితాలోకి..!

Posted: 01/11/2019 12:31 PM IST
Amazon chief jeff bezos may lose world s richest tag after divorce

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ అపర కుబేరుడైన జెఫ్‌ బెజోస్‌ ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఒకడిగా తన పేరును లఖించుకున్నాడు. అయితే ఆయనకు దక్కిన ఈ ఖ్యాతి త్వరలోనే కనుమరుగు కానుందా.? అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే ఆయన తన ఆస్తిలోని కొంత భాగాన్ని భరణంగా తన సతీమణికి చెల్లిస్తున్నారు కాబట్టి. ఈ విషయాన్ని జెఫ్ బెజోస్ స్వయంగా ప్రకటించి అమెజాన్ పరిచయమున్న అందరినీ విస్మయానికి గురిచేశాడు.

అయితే ఇక్కడే మరో ఆశ్చర్యకర విషయం కూడా వెలుగులోకి రానుంది. అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ భార్య మెక్కంజీ.. ఆయన నుంచి విడాకులు పోందిన తరువాత అమె ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలి జాబితాలో చేరిపోనుంది. ఔనా.. ఇద్దరు విడిపోనున్నారా.? అంటే ఇద్దరూ కలసి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన సారాంశం మాత్రం వారు త్వరలోనే విడాకులు పోందనున్నారని స్పష్టం చేస్తోంది. విడిపోయిన పక్షంలో భరణం మాత్రమే తీసుకునే ఆయన సతి ఎలా అత్యంత సంపన్నురాలి జాబితాలోకి చేరుతుందనేగా మీ సందేహం..?

54 నాలుగేళ్ల జెఫ్ బెజోస్ నికర ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు. పాతికేళ్ల వైవాహిక జీవితం తరువాత బెజోస్‌, ఆయన భార్య మెకంజీ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా విడిగా ఎలా ఉండగలమనేది ప్రయోగాత్మకంగా చూశామని.. విడిపోయి స్నేహితులుగా ఉండగలమనే నమ్మకం కుదిరాక చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలని నిశ్చయించామని వారిద్దరూ కలసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విడాకుల వల్ల జెఫ్‌ బెజోస్‌ తన ఆస్తిలో దాదాపు సగం -మెకంజీకి భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని విలువ దాదాపు 62.15 బిలియన్‌ డాలర్లు. అంటే సుమారు 4.2 లక్షల కోట్లు మనోవర్తి కింద చెల్లిస్తున్నాడు. ప్రపంచ చరిత్రలో ఇంత భారీగా మనోవర్తి తీసుకోనున్న మహిళ మెకంజీయే కానుండడం విశేషం. అంతేకాదు, ఈ భరణం ద్వారా ఆమె ప్రపంచంలోనే అత్యధిక సంపన్నురాలైన మహిళ కానున్నారు. నవల రచయిత్రిగా అమె ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.
 
కొన్నాళ్లుగా జెఫ్‌ బెజోస్‌ -లారెన్‌ శాంచెజ్‌ అనే ఫాక్స్‌ టెలివిజన్‌ హోస్ట్ తో ప్రేమాయణం నెరపుతున్నారు. లారెన్‌ మాజీ భర్త, హాలీవుడ్‌ ఏజెంట్‌ ప్యాట్రిక్‌ వైట్సెల్‌ స్వయంగా లారెన్‌ను బెజోస్ కు పరిచయం చేయడం మరో విశేషం. లారెన్‌ లైసెన్స్‌ కలిగిన హెలికాప్టర్‌ పైలట్‌ కూడా. ఆమెకు ఏరియల్‌ ఫిల్మింగ్‌లో ఆమె నైపుణ్యం ఉండడమే కాకుండా అనేక హాలీవుడ్‌ సినిమాలకు ఆమె ఏరియల్‌ ఫిల్మింగ్‌ కన్సల్టెంట్‌ కూడా! కేవలం వారం కిందటే జెఫ్‌ బెజోస్‌ నేతృత్వంలోని అమెజాన్‌ - మైక్రొసా్‌ఫ్టను దాటి అత్యధిక టర్నోవర్‌ ఉన్న కంపెనీగా అవతరించింది. విడాకుల కారణంగా- కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సీన్‌ రివర్స్‌ కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amazon  Amazon CEO Jeff Bezos  Jeff Bezos  MacKenzie  Jeff Bezos divorce  MacKenzie divorce  

Other Articles