HS phoolka sensation comments on AAP ఉధ్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చడం తప్పు: ఫూల్కా

Converting anti corruption stir into political party was wrong hs phoolka

AAP, Anna Hazare, Arvind Kejriwal, Congress, HS Phoolka, BJP, Aam Aadmi Party, Punjab, non political platform, anti-corruption

A day after resigning from the Aam Aadmi Party, senior advocate HS Phoolka said that converting an anti-corruption movement into a political party in 2012 was "wrong".

ఉధ్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చడం తప్పు: ఫూల్కా

Posted: 01/05/2019 11:35 AM IST
Converting anti corruption stir into political party was wrong hs phoolka

ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్‌ నేత, సీనియర్ అడ్వకేట్ హెచ్ఎస్ ఫూల్కా తాను ఇన్నాళ్లు కోనసాగిన పార్టీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీ నుంచి గతంలో వెళ్లిన పలువురు నేతల మాదిరిగానే ఆయన కూడా తాజాగా పార్టీపై నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. అప్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చడం తప్పుని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన ఫూల్కా.. మరోమారు అలాంటి వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక నడవాలని, అందుకోసం తాను రానున్న ఓ వేదికను స్థాపించనున్నానని ప్రకటించారు. ఇది రాజకీయ పార్టీలకు సమాంతర శక్తిగా పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో తాను రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా పాల్గోనబోనని ఫూల్కా స్పష్టం చేశారు.

ఇక ఈ వేదిక ద్వారా దేశంలోని వైద్యులు, న్యాయవాదులు అందర్నీ అహ్వానిస్తానని చేప్పారు. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం మాదిరిగా ఈ వేదికను తీర్చిదిద్దాల్సిన అవసరం వుందన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అన్నా హాజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలకు సమాంతరశక్తిగా కనిపించిందని పేర్కొన్న ఫూల్కా.. దానిని రాజకీయ పార్టీగా మార్చి తప్పు చేశారని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ముగిసిపోలేదని, మళ్లీ  అటువంటి ఉద్యమమే రావాల్సిన అవసరం ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles