795 km women jyothi to save sabarimala సేవ్ శబరిమల: జ్యోతులతో మహిళల ప్రదర్శన

Ayyappa jyothi volunteers line up with lamps lit on kerala public roads

Ayyappa Jyothi, sabarimala, women entry, supreme court, Ranjan Gogoi, Shylaja Vijayan, National Ayyappa Devotees Association, five-judge Constitution Bench, Constitution Bench, review plea, fundamental rights, sabarimala temple, ban on entry of women, entry rights, patriarchy, gender bias, sabarimala row

The Ayyappa Jyothi was organised as a low key affair to convince the Marxist government in Kerala the need to preserve the sanctity of the famous shrine of Sabarimala

సేవ్ శబరిమల: 795 కిమీల పోడవునా జ్యోతులతో మహిళల ప్రదర్శన

Posted: 12/28/2018 01:38 PM IST
Ayyappa jyothi volunteers line up with lamps lit on kerala public roads

శబరిగిరిపై కొలువైన అయ్యప్ప స్వామి ఆలయ పవిత్ర, విశిష్టతను కాపాడాలంటూ కేరళలోని మహిళలు కదం తొక్కారు. అయితే గతంలో చేసిన అందోళనలకు భిన్నంగా తమ మణికంఠుడి ఆలయ పవిత్రత పరిరక్షించాలంటూ ఏకంగా 795 కిలోమీటర్ల పోడవునా అత్యంత భారీ ప్రదర్శన చేశారు. చేతులలో అయ్యప్ప జ్యోతులను వెలిగించి పట్టుకుని స్వామియే శరణం అయ్యప్ప అంటూ.. నినాదాలు చేశారు.

శబరిమల పవిత్ర విషయంలో ఎంతో ఓర్పు, సహనంతో చైతన్యం చూపించిన కేరళా మహిళా సుమారు రెండు గంటల పాటు ప్రదర్శన నిర్వహించి.. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి చెమటలు పట్టేలా చేశారు. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం చేయవచ్చని ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని వేడుకున్నారు.

కేరళలోని పట్టణాలు, గ్రామాలు, రహదారులను కలిపేలా మొత్తం 795 కిలోమీటర్ల మేర మహిళలు భారీ ప్రదర్శన చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో దీపాలతో రోడ్డుకు రెండు పక్కలా నిలబడి తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో చెప్పారు. కేరళకు ఉత్తరాన ఉన్న కసర్గాడ్ జిల్లా హోసంగడి నుంచి దక్షిణాన ఉన్న రాజధాని తిరువనంతపురం మీదుగా కన్యాకుమారిలోని త్రివేణి వరకు దీపాల ప్రదర్శన చేశారు. శబరిమల పవిత్రత, సంప్రదాయం కాపాడాలి అంటూ నినదించారు.

మహిళలు, యువతులు, చిన్న పిల్లలు ఇలా అన్ని వర్గాల వాళ్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పురుషులు కూడా మహిళలకు మద్దతు తెలుపుతూ జ్యోతులు వెలిగించి తమ ఆకాంక్ష చాటారు. డీజీపీ టీపీ సేన్ కుమార్, నటుడు-బీజేపీ ఎంపీ సురేష్ గోపి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమల కర్మ సమితి పిలుపుతో మహిళలంతా ఇలా తమ ఐక్యతను చూపించారు. శబరిమలలో మహిళ ప్రవేశాన్ని నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayyappa Jyothi  sabarimala  save sabarimala  women entry  supreme court  politics  

Other Articles