common mobility card soon for hyderabadis నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో కామన్ మొబిటిటీ కార్డు..

Telangana government to bring common mobility card for hyderabadis

telangana government, CM KCR, common card promises, common mobility card, MMTS, Metro, RTC bus, Hyderabad passengers

Telangana government to bring common mobility card for hyderabad passengers to keep a check on traffic and pollution in the city.

నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో కామన్ మొబిలిటీ కార్డు..

Posted: 12/19/2018 12:46 PM IST
Telangana government to bring common mobility card for hyderabadis

హైదరాబాద్ నగర ప్రయాణికులకు గతేడాది శుభవార్తను అందించింది ప్రభుత్వం. నగరంలో ప్రజారవాణా వ్యవస్థలైన మెట్రో, ఆర్టీసీ బస్సు, ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణించే వారికి ఈ విషయాన్ని చెప్పిన ప్రభుత్వం వారికి ఈ మూడు రవాణా వ్యవస్థలో ప్రయాణించేందుకు వీలుగా కామన్ మొబిలిటీ కార్డులు తీసుకువస్తామని చెప్పింది. అయితే మెట్రో రైలు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో కాసింత ఆలస్యం జరిగింది. త్వరలో మూడు మెట్రో మార్గం కూడా అందుబాటులోకి రాబోతున్న తరుణంలో తామిచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది.

ఆర్టీసీ, మెట్రోతో పాటు ఎంఎంటీఎస్ ను కూడా అనుసంధానిస్తూ ఈ కార్డును రూపొందిస్తుంది. కామన్ మొబిలిటీ కార్గులు వచ్చే నెలాఖరు వరకూ డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం. దీంతో నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామన్ మొబిలిటీ కార్డులపై మరోసారి కదలిక వచ్చింది. నగరంలో మెట్రో రైలు సర్వీసులు రెండు ప్రాంతాల నుంచి విజయవంతంగా నడుస్తున్నాయి. రోజుకి రెండు లక్షలమంది జనం మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

వచ్చే నెలలో హైటెక్ సిటీ రూట్ లో కూడా మెట్రో రైలు పట్టాలకెక్కితే… ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముంది. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళను లింక్ చేస్తూ… పాస్ లు ఇష్యూ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మెట్రో రైల్లో టిక్కెట్లకి, బస్ పాస్ లకు వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది.  దాంతో కామన్ పాస్ ఉంటే… ఖర్చులు తగ్గుతాయనీ… కామన్ మొబిలిటీ కార్డు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో బేగంపేట హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ జరిగింది.  మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ లకు కలిపి కామన్ మొబిలిటీ కార్డు ప్రవేశపెట్టడంపై ఈ సమావేశంలో చర్చించారు.  ఎస్బీఐ, హిటాచీ కన్సార్టియంతో కామన్ మొబిలిటీ కార్డు ను ప్రవేశపెట్టడంపై ఎల్ అండ్ టి మెట్రో సీఈఓ అనిల్ శైనీ వివరించారు.  ఈ కార్డుల జారీ కోసం ఎస్బీఐతో సంప్రదింపులు జరపాలని ఈర్టీసీ ఈడీకి  ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles