devotees throng in temples on Mukkoti Ekadasi ముక్కోటి ఏకాదశి: వైష్ణావాలయాలకు పోటెత్తిన భక్తులు..

Devotees throng in temples on vaikunta ekadasi

Vaikunta Ekadasi, devotees, Badrachalam, Tirumala, mukkoti Ekadasi, vaishnava temples, Lord Venkateswara, Telangana, Andhra Pradesh

Devotees throng to temples in telugu states on the eve of Vaikunta Ekadasi, today the Lord Venkateshwara swamy will give his darshan in north direction.

ITEMVIDEOS: వైకుంఠ ఏకాదశి: వైష్ణావాలయాలకు పోటెత్తిన భక్తులు..

Posted: 12/18/2018 01:05 PM IST
Devotees throng in temples on vaikunta ekadasi

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో గోవింద నామ స్మరణలు మారుమ్రోగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకోడానికి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుని దర్శించి తరిస్తున్నారు భక్తులు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం.

ఇక, అటు తిరుమల శ్రీవారి ఆలయంలో, ఇటు ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు శ్రీవారు దర్శనం ఇస్తున్నారు. సోమవారం రాత్రికే లక్ష మంది భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆదివారం నుంచే ప్రవాహంలా వచ్చిన భక్తులతో క్రితం రోజునే కంపార్టుమెంట్ల నిండిపోయాయి.

గోవిందమాల ధరించిన వేలాది మంది భక్తులు పసుపు ముడుపులతో తిరుమల చేరుకున్నారు. అటు భద్రాచలం సీతారామస్వామి ఆలయంలోనూ ముక్కోటి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్తర ద్వార నుంచి సీతారాముల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రత్యేక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగుతున్నాయి.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles