Sujana Chowdary granted protection from arrest సుజనా చౌదరికి ఊరట.. అరెస్టు చేయవదన్న హైకోర్టు

Tdp leader ys chowdary granted protection from arrest in money laundering case

Y Satyanarayana Chowdary, Enforcement Directorate, Delhi High Court, Telugu Desam Party, PMLA, BJP, Sujana Group, crime

The Delhi High Court directed the Enforcement Directorate to refrain from taking any coercive action against TDP MP Y Satyanarayana Chowdary in a money laundering case, The court also asked him to appear before the agency on December 3.

సుజనా చౌదరికి ఊరట.. అరెస్టు చేయవదన్న హైకోర్టు

Posted: 11/30/2018 06:13 PM IST
Tdp leader ys chowdary granted protection from arrest in money laundering case

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వై. సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయరాదని ఢిల్లీ హైకోర్టు ఈడీని అదేశించింది. సుజనా చౌదరిపై ఎటువంటి నిర్భంధ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులను న్యాయస్థానం అదేశించింది. కాగా, పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు సుమారు 5,700 కోట్ల రూపాయల రుణాలను ఎగవేశారన్న అభియోగాలపై ఈడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.

కాగా, ఆయన అధ్వర్యంలో నడుస్తున్న పలు సంస్థలు రుణాలను ఎగవేశారన్న అభియోగాల నేపథ్యంలో ఆయన ఈడీ అధికారుల ఎదుట డిసెంబర్ 3న హాజరుకావాలని అదేశించింది. సుజనా చౌదరి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు సమన్లు జారీ చేసి అరెస్టు చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తుందని ఇది కేవలం వేధింపు రాజకీయాల పర్యవసానమని ఆయన ఢిల్లీ హైకోర్టును అశ్రయించారు.

కేంద్ర క్యాబినెట్ లో వున్నానినాళ్లు తన వ్యాపారవ్యహరాలపై రాని పిర్యాదులు ఇప్పుడు కేంద్రం నుంచి తప్పుకోగానే వచ్చాయిని.. ఇదంతా కేంద్రం సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతుందని ఆయన తన పిటీషన్లో పేర్కోన్నారు. కేంద్రం తనను వేధిస్తోందని, రాజకీయంగా కక్ష సాధిస్తోందని  చౌదరి కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆయనపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవారని ఎన్ ఫోర్స్ మెంట్ ఢిపార్టుమెంట్ అధికారులను అదేశించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles