HC directs to provide 4+4 security to Revanth రేవంత్ రెడ్డీకి సెక్యూరిటీ కల్పించాల్సిందే: హైకోర్టు

High court directs state government to provide 4 4 security to revanth reddy

revanth reddy, high court, congress, telangana, security to revanth reddy, 4+4 security to revanth, telangana assembly elections 2018, telangana politics

Hyderabad High Court directed the state government to provide 4+4 security along with an escort for Congress working president Revanth Reddy.

రేవంత్ రెడ్డీకి సెక్యూరిటీ కల్పించాల్సిందే: హైకోర్టు

Posted: 11/30/2018 04:21 PM IST
High court directs state government to provide 4 4 security to revanth reddy

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట కలిగింది. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భదత్ర కల్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రేవంత్‌కు 4+4 సెక్యూరిటీతో పాటుగా ఎస్కార్టు కూడా కల్పించాలని సూచించింది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ భద్రతను కొనసాగించాలంది. గతంలో రేవంత్ వేసిన పిటిషన్‌పై.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు తాజా ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ న్యాయవాది ఇచ్చిన తీర్పుపై కేంద్రం అపీల్ కు వెళ్లడంతో హైకోర్టు ఈమేరకు ఆదేశాలను జారీ చేసింది.

తనకు ప్రాణ హాని ఉందని.. భద్రత కల్పించాలంటూ రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. రేవంత్ కు భద్రత కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ హైకోర్టులో అపీల్‌ కు వెళ్లింది. స్థానిక నేతలకు భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించాలని పిటీషన్ వేశారు.

కేంద్ర హోంశాఖ అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని ఆదేశించింది. 4+4 భద్రతో పాటూ ఎస్కార్ట్ ఉండాలని సూచించింది. మరోవైపు రేవంత్ రెడ్డి ఇవాళ కూడా సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ.. మావోయిస్టుల దాడి తరహాలో తనను అంత చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన సంచలన అరోపణలు చేశారు. ఇక ఇవాళ ఆయన తన ఖమ్మం ప్రచార సభను కూడా రద్దు చేసుకున్నారు. హైకోర్టు ఆదేశించినా తనకు భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో హైకోర్టు తీర్పు ఊరట కలిగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  security  escort  high court  congress  telangana  politics  

Other Articles