SC Calls Nitish Kumar Govt Inhuman & Shameless నితీష్ సర్కారకు సుప్రీంకోర్టు మెట్టికాయలు..

Sc asks if children raped in bihar shelter homes lesser citizens

bihar, IPC, Janata Dal United, JD(U), Nitish Kumar, pocso, Shelter Home, shelter home rapes, supreme court, crime

The Supreme Court questioned the registration of FIRs only under the Protection of Children from Sexual Offences (POCSO) and not under relevant sections of the IPC.

పిల్లలు పౌరులు కాదా.? నితీష్ సర్కారకు సుప్రీం మెట్టికాయలు..

Posted: 11/27/2018 02:22 PM IST
Sc asks if children raped in bihar shelter homes lesser citizens

బీహార్ ప్రభుత్వ అమానవీయంగా, నిసిగ్గుగా వ్యవహరిస్తుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఇవాళ మెట్టికాయలు వేసింది. ప్రభుత్వ వసతి గృహాల్లో చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో నితీష్ కుమార్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా అక్షింతలు దట్టించింది. ఈ కేసుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు దురదృష్టకరం అని సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. చిన్నారులు దేశ పౌరులు కాదు అన్నట్లుగా బీహార్ ప్రభుత్వం తీరు వుందని అక్షేపించింది.

‘ఈ కేసుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి చాలా దురదృష్టకరం, విచారకరం. ఓ చిన్నారి లైంగిక వేధింపులకు గురైతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. మీరు కనీసం ఎఫ్‌ఐఆర్‌ను కూడా సరిగా నమోదు చేయలేకపోయారు. రాష్ట్రంలోని 17 వసతి గృహాలపై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. ఎందుకు ప్రతి కేసును దర్యాప్తు చేయట్లేదు. ఈ చిన్నారులు పౌరుల కంటే తక్కువా?’ అని సుప్రీంకోర్టు బిహార్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

చిన్నారులపై లైంగిక దాడుల కేసులను అత్యంత శ్రద్ధ పెట్టి దర్యాప్తు చేయాలని అత్యున్నత న్యాయస్థానం అదేశించినా.. ప్రభుత్వానికి మాత్రం దీనిపై అసలు శ్రద్ద లేదని, అక్షేపించింది. ఇదేనా మీ శ్రద్ధ..? ఈ కేసును చూసిన ప్రతిసారి చాలా బాధగా ఉంటోంది’ అని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుల వ్యవహారంలో ఇకపై ఎఫ్‌ఐఆర్‌ సరిగా నమోదు చేయకపోయినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.

బిహార్లోని ఓ వసతి గృహంలో 34 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబయికి చెందిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ చేపట్టిన అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని పలు వసతి గృహాలపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. బాలుర వసతి గృహాల్లోనూ చిన్నారులు భౌతిక హింసకు గురవుతున్నట్లు తేలింది. అయితే ఈ కేసుల పట్ల నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar  IPC  Nitish Kumar  pocso  shelter home rapes  supreme court  crime  

Other Articles