independent candidate indifferent campaign జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

Independent candidate indifferent campaign in jagityal

jagtial constituency, independent candidate, akula hanmandlu, karimnagar, jeevan reddy, jagtial independent candidate, congress, TDP, MahaKutami, Telangana Assembly elections, Politics

At the time of elections candidates give many promises and forget, but a independent candidate from jagityal, distributing slippers to beat him and make the work done, if he elects and forget to fullfill the promises.

ITEMVIDEOS: జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

Posted: 11/22/2018 03:33 PM IST
Independent candidate indifferent campaign in jagityal

ఏ రాష్ట్ర ఎన్నికలైనా.. లేక స్థానిక సంస్థల ఎన్నికలైనా అభ్యర్థులు విచిత్ర ప్రచారం మాత్రం ఓటర్లకు వినూత్నంగానే వుంటుంది. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులు తమ గెలుపుకోసం చేసే ప్రచారాలు విభిన్నంగా వుండటంతో ఓటర్లను అకర్షిస్తుంటాయి. ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతుండగా, అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలకు ప్రాముఖ్యతను ఇస్తూ.. తమను అశీర్వదించాల్సిందిగా కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు అనేక హామీలను కూడా గుప్పిస్తుంటారు.

అయితే గెలిచిన తరువాత వారు తాము ఓటర్లకు ఇచ్చిన హామీలను మర్చిపోతుంటారు. అసలు వారి వద్దకెళ్లి సమస్యలను మెరపెట్టుకుందామని ప్రయత్నించినా వారు అందుబాటులో వుండరు. వున్నా.. తామేదో మీటింగ్ లో వున్నామంటూ పంపించివేస్తుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం మనం చూస్తుంటా. అయితే అలా తాను ఓటర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోయినా.. లేక వాటిని నేరవేర్చకపోయినా.. తనతో పని చేయించుకునేందుకు ఓ ఉపాయాన్ని కూడా చెబుతున్నాడు జగిత్యాలలోని ఓ స్వతంత్ర్య అభ్యర్థి.

ఏంటా ఉపాయం అంటే.. తన ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన ఓటర్లకు తన రాజీనామా లేఖ అందించడంతో పాటు చెప్పును కూడా అందిస్తున్నాడు. తనకు ఓట్లేసి గెలిపించిన తరువాత ప్రజలకు తానిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోయినా, మర్చిపోయినా తనను చెప్పులతో కొట్టి మరీ పని చేయించుకోవాలని స్వతంత్ర అభ్యర్థి ఆకుల హన్మండ్లు, ఓటర్లకు స్పష్టం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా, మెట్టుపల్లి పట్టణంలో ఆకుల హన్మండ్లు ఇలా వినూత్నంగా ప్రచారం చేయడం అందరికీ అకట్టుకుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles