Salman Khan gets death threat బాలీవుడ్ అగ్రహీరోను బెదిరించిన వ్యక్తి అరెస్టు

Man detained for sending death threat to salman khan

bollywood actor gets death threat, death threat to salman khan, Man detained for sending death threat, UP man held in thrratening salman khan, Mumbai, Salman Khan, Katrina Kaif, Ali Abbas Zafar, Bharat, death threat, farook, bollywood, crime

The man who was sent death threats to Salman Khan has been arrested in UP. Farook alias Sheru was disappointed with the actor for allegedly declining his repeated requests of meeting the actor.

బాలీవుడ్ అగ్రహీరోను బెదిరించిన వ్యక్తి అరెస్టు

Posted: 11/20/2018 02:32 PM IST
Man detained for sending death threat to salman khan

దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మన బాలీవుడ్ హీరోలకు, నటీమణులకు చాలా ఆదరణ వుందన్న విషయం అతిశయోక్తి కాదు. మన బాలీవుడ్ తారలను కలిసేందుకు ఏకంగా వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే వారికున్న అదరణను అర్థం చేసుకోవచ్చు. ఇక రాజులు, రాజ్యాలు వున్న దేశాల్లో ఈ కార్యక్రమాన్ని స్వయంగా యువరాజుల ఆధ్వర్యంలోనే జరుగుతుందంటే.. వారి సెలబ్రిటీ స్టేటస్ కు ఇది అద్దం పడుతోంది.

అలాంటి సెలబ్రిటీతో కలవాలని, వారితో కుదిరితే రెండు మాటలు మాట్లాడాలని, ఇంకా అవకాశం కల్పిస్తే ఓ సినిమాలో నటించాలని ఏ అభిమాని మాత్రం కోరుకోడు. అయితే ఇలాంటి ప్రయత్నాలే చేసిన ఓ హీరో అభిమానం పరాకాష్టకు చేరి.. తన అభిమాన హీరోకే చంపేస్తానంటూ బెదిరింపులు పంపించాడు. ఔనా ఎందుకిలా చేశాడంటే.. తన అభిమాన హీరోను కలుసుకోవాలన్న తన అశ తీరక.. ఆయన కలసి నటించాలన్న అవకాశం లభించక ఇలా అభిమాని ఉన్మాదిగా మారాడు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన యూపీకి చెందిన ఒక వ్యక్తి ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. ముంబై పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సల్మాన్ ఖాన్ అభిమాని.. హీరో పర్సనల్ మేనేజర్ ఫోన్ నెంబర్ ను సంపాదించాడు. అతనికి ఫోన్ చేసి, సల్మాన్ ఫోను నెంబరు కావాలని అడిగాడు. దీనికి అతను నిరాకరించాడు.

దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి తిట్ల దండకం అందుకుంటూ, సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఇంతటితో ఆగక అతను సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ కు కూడా ఫోన్ చేసి సల్మాన్ ఫోన్ నంబరు అడిగాడు. తాను గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ దగ్గర పనిచేస్తుంటానని తెలిపాడు. సల్మాన్ తండ్రి కూడా ఫోన్ నంబర్ ఇవ్వకపోవడంతో అతనిని కూడా బెదిరించాడు. కాగా సల్మాన్ తరపున అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యూపీకి చెందిన గులాబన్బీ ఉరఫ్ షేర్‌ను నిందితునిగా గుర్తించి అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Salman Khan  Katrina Kaif  Ali Abbas Zafar  Bharat  death threat  farook  bollywood  crime  

Other Articles