Cyclone Gaja: TN, AP, Puducherry on red alert తీర ప్రాంత ప్రజలను ‘గజ’గజలాడిస్తుంన్న తుఫాన్.!

Imd issues alert as severe cyclonic storm expected within 24 hours

cyclone gaja, cyclone gaja, cyclonic storm gaja, cyclone gaja news, cyclone gaja path, cyclone gaja latest news, cyclone gaja status, cyclone gaja coming, cyclone gaja updates, cyclone gaja date, cyclone gaja in odisha, cyclone gaja 2018, cyclone gaja update 2018, cyclone gaja in bay of bengal, bay of bengal, tamil nadu news, andhra pradesh news

Cyclone Gaja effect: With the cyclonic storm which is expected to hit Tamil Nadu on November 15, at least 32 revenue districts under 13 districts have been put on high alert in the state.

తీర ప్రాంత ప్రజలను ‘గజ’గజలాడిస్తుంన్న మరో తుఫాన్.!

Posted: 11/13/2018 10:55 AM IST
Imd issues alert as severe cyclonic storm expected within 24 hours

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ‘గజ’మరో 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను నవంబరు 15న కడలూరు, పాంబన్ మధ్య మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

‘గజ’తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వాసులను కలవరానికి గురిచేస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖలోని ఆర్కే బీచ్, రుషికొండలో కెరటాలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో పర్యాటక శాఖ స్పీడ్ బోట్లను, ప్రైవేట్‌ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కయాకింగ్‌ తదితర జల విన్యాసాలను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లిన వారు కూడా వెనక్కు తిరిగి వస్తున్నారు.

దక్షిణ కోస్తా పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అన్ని పోర్టుల్లోనూ రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఏపీలో నేటి నుంచి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నవంబరు 14 నుంచి 16 వరకు గజ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబరు 15న మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీతోపాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను తీవ్రరూపం దాల్చి నవంబరు 13, 14 తేదీల్లో తమిళనాడు తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles