Operation B: Centre to target TDP with IT, ED పక్షం రోజుల్లో టీడీపీ నేతలే టార్గెట్ గా అల్లకల్లోలం

After garuda center impliments operation b to fix chandrababu

chandrababu, CBN, Operation B, TDP leaders, Income tax, Enforcement Directorate, PMO, PM Modi, Congress, National Politics, Politics

Centre is now set to start 'Operation B' i.e Babu aka Chandrababu. According to filmmaker Tammareddy Bharadwaj who claimed to have got the information from PMO, Centre is likely to start Operation B targeting TDP Leaders with IT, ED raids in order to 'fix' him.

ప్రధాని కనుసన్నల్లో.. ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయ్: తమ్మారెడ్డి

Posted: 11/09/2018 03:08 PM IST
After garuda center impliments operation b to fix chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కన్నేసిన బీజేపి.. ఎలాగైనా తాము తమ లోపాయికారి మిత్రపక్షాలతో అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో పక్షం రోజుల్లో టీడీపీలోని క్రియాశీలక నేతలను టార్గెట్ చేసుకుని అదాయ, ఈడీ అధికారులతో దాడులు చేయించి.. టీడీపీ పార్టీ నేతల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు రంగం సిద్దం చేసిందని.. దాని పేరే అపరేషన్ బి అని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత... ఆ పార్టీ ఏపీపై మరింత తీవ్ర స్థాయిలో దాడికి తెగబడబోతోందనే వార్తలు తన వరకు వచ్చాయని ఆయన తెలిపారు. రానున్నపక్షం రోజుల్లో టీడీపీ సానుభూతిపరులైన ప్రముఖులు, తెలంగాణ, ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఈ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు జరగబోతున్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. ప్రధాని కార్యాలయంలో ఉన్న ఒక కీలక అధికారి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

అయితే ఎవరెవర్ని ఐటీ, ఈడీ సంస్థలు టార్గెట్ చేశాయన్న జాబితాను కూడా ఆయన చెప్పారు. వారి పేర్లను ప్రస్తావించకుండా చూచాయగా వారికి సమాచారాన్ని అందించారు. విజయవాడలో ఉన్న ఇద్దరు హోటల్ యజమానులు, విజయవాడ దగ్గరలో ఉన్న పెద్ద యూనివర్శిటీ యజమాని దాడులను ఎదుర్కోబోయే జాబితాలో ఉన్నారని తమ్మారెడ్డి తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న టాప్ టీడీపీ నేతలు, బయో ఫర్టిలైజర్స్ బిజినెస్ లో ఉన్న ఓ నేత, మైనింగ్ లో ఉన్న ఒక నేత, రియలెస్టేట్ లో ఉన్న మరో నేతలను ఈ సంస్థలు టార్గెట్ చేయనున్నాయన్నారు.

తనకు అందిన సమాచారంలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలతో పాటు అదే జిల్లాలో ఇసుక వ్యాపారంలో ఉన్న ఇద్దరు నేతలు... ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు... ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాలకు చెందిన మరో ఇద్దరు మంత్రులు, గుంటూరు జిల్లాకు చెందిన ఒక సంపన్న ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మరో నేత, పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక బిజినెస్ తో సంబంధం ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక సంపన్న ఎంపీపై దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

సీఎం రమేష్ పై ఇప్పటికే దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను ఏదో ఒకటి చేసిన దెబ్బతీయాలని బీజేపి భావిస్తుందని తెలిపారు. దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ నేతలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వీరంతా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితులను తీసుకొస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే ఫార్ములాను ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో వాడుతున్నారని ఆయన తెలిపారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని దారుణాలు జరిగినా కళ్లుమూసుకునేు కేంద్రం.. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కుట్రలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. కేరళ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే శబరిమల అంశాన్ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని అన్నారు. ఆపరేషన్ గరుడ విషయంలో హీరో శివాజీని లోపల వేసి, విచారణ జరిపించాలని డిమాండ్ చేసే బీజేపీ, వైసీపీ నేతలు.. తాజాగా తనపై కూడా ఇలాంటి డిమాండ్లను తెరపైకి తీసుకురావచచని అన్నారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని... అందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల... జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే... ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. అయితే, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న ఆయన గతంలో తాను చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానని గుర్తుచేశారు.

కేంద్రం నియంతృత్వ విధానాలను అవలంభిస్తుందని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని.. అందువల్లే తనకు వరకు చేరిన విషయాలను బహిరంగ పర్చానని తమ్మారెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దొంగలైనప్పుడు ఎన్డీయేతో టీడీపీ కలిసున్నప్పుడే దాడులు చేసి ఉండవచ్చని... విడిపోయిన తర్వాతే ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఇదంతా అవకాశవాదమే అని చెప్పారు. దక్షిణాదిలో పాతుకుపోవడం అంత ఈజీ కాదనే విషయం కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి తెలిసిపోయిందని... అందుకే 'ఆపరేషన్ బి'ని ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ ను ఇంత వరకు విమర్శించామని... కానీ, బీజేపీ ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలోని కీలక వ్యవస్థలను కూడా తమ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని తమ్మారెడ్డి దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles