BJP councillor supporters open firing బీజేపి కౌన్సిలర్ కు బెయిల్.. అనుచరుల ఓపెన్ ఫైరింగ్..

Bjp councillor supporters open celebratory fire as he gets bail

Manish Chaudhary, Jail, celebratory firing, SUV Firing, open air firing, BJP councillor, UP sub-inspector, Sukhpal Singh Panwar, woman lawyer, social media, Delhi-Dehradun highway, Restaurant, judicial custody, Bail, meerut, Crime

Supporters of BJP councillor Manish Chaudhary, who had assaulted a UP sub-inspector, open celebratory firing from their moving SUV in the middle of a busy road in Meerut to celebrate release of Chaudhary whose bail plea was accepted.

బీజేపి కౌన్సిలర్ కు బెయిల్.. గాల్లోకి అనుచరుల కాల్పులు

Posted: 11/05/2018 02:48 PM IST
Bjp councillor supporters open celebratory fire as he gets bail

అనువుగాని చోట అధికులమనరాదు.. కొంచమై వుండుటెల్ల కొదవకాదు.. కొండ అద్దమందు కొంచమై వుండదా.. అని కవి వేమన తన కవితలలో ఎంతో చక్కగా చెప్పి బావితారాలకు అందించినా వాటిని వంటపట్టించుకుని అచరిద్దామని ఈ రోజుల్లోని ఎవరూ అలోచించడం లేదు. అధికారంలో వుంటే అంతా మనదే.. ఎమైనా చేయవచ్చు.. ఎలాగైనా ప్రవర్తించవచ్చునని భావిస్తున్నారు నేతలు. మరీ ముఖ్యంగా అటు కేంద్ర, రాష్ట్రాల్లో ఇటు స్థానికంగా కూడా తమే అధికారంలో వున్నామని బీజేపి నేతలు శృతిమించి వ్యవహరిస్తున్నారు.

దేశరాజధాని ఢిల్లీ-డెహ్రాడూన్ రహదారిపై వున్న తన రెస్టారెంటులో బోజనానికి వచ్చిన సబ్ ఇన్స్ పెక్టర్ సుఖ్ పాల్ సింగ్ పాన్ వర్ పై దాడి చేసి చితకబాదడమే కాకుండా.. మహిళా న్యాయవాదితో అనుచితంగా వ్యవహరించిన బీజేపి కౌన్సిలర్ మనీష్ చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రెండు వారాల క్రితమే జైలుకు పంపారు. కాగా, కౌన్సిలర్ మనీష్ చౌదరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జుడీషియల్ రిమాండ్ నుంచి బెయిలుపై బయటకు వచ్చారు.

అయితే తమ నాయకుడు మనీష్ చౌదరి విడుదలపై అతని అనుచరులు కూడా చట్టానికి అతీతంగా వ్యవహరించారు. యధా రాజా తథా ప్రజ అన్న రీతిలో వ్యవహరించిన ఆయన అనుచురులు ఆయన విడుదల సందర్భంగా ఎస్ యూ వీ వాహనంలో ఆయన వెంట వెళ్తూ చేతిలోకి రివాల్వర్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేసి అధికారం వుంటే అతీతశక్తులే అన్న చందాన వ్యవహరించారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

రెస్టారెంటులో దాడికి కారణమిదే:

బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరికి చెందిన ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కోసం ఎస్ఐ సుక్పాల్ సింగ్ పవార్.. తనకు పరిచయస్తురాలైన ఓ మహిళా న్యాయవాదితో కలసి వచ్చారు. బోజనం అర్డర్ ఇచ్చారు. అయితే ఎంత సేవు వేచి చూసినా ఇంకా అర్డర్ రాకపోవడంతో వారు హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అప్పటికీ వారికి సిబ్బంది బోజనం వడ్డించలేదు. దీంతో అసలే ఆకలితో నకనకలాడుతున్న వారు హోటల్ సిబ్బందిని తిట్టడం ప్రారంభించారు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన రెస్టారెంట్ ఓనరైన బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరికి ఎస్ఐ కి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలోనే మనీష్ ఎస్‌ఐను చావగొట్టాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manish Chaudhary  Jail  celebratory firing  SUV Firing  meerut  Bail  Crime  

Other Articles