Gujarat Pharma Tycoon Nitin Sandesara Fled to Nigeria? బ్యాంకులకు శఠగోపం.. విదేశాలకు వ్యాపారి జంప్..

Rs 5000 crore bank fraud gujarat pharma tycoon nitin sandesara fled to nigeria

Bank fraud, Bank fraud cases, Bank frauds by Sandesara, cbi, ED, Gujarat bank fraud, Gujarat businessman, Gujarat-based pharma company, Nitin Sandesara, Sterling Biotech, Vadodara-based Sterling Biotech, crime

Nitin Sandesara, absconding director of a Gujarat-based pharma company which is being probed in a Rs 5,000 crore fraud case, have fled to Nigeria, according to sources in the CBI and the ED.

రూ.5వేల కోట్ల కుచ్చుటోపి.. గుజరాత్ వ్యాపారవేత్త నితిన్ పరారీ..

Posted: 09/24/2018 05:34 PM IST
Rs 5000 crore bank fraud gujarat pharma tycoon nitin sandesara fled to nigeria

దేశంలో అక్రమార్జన పెరిగిపోయి బ్లాక్ మనీ పేరుకుపోతోందని, ఈ డబ్బు విదేశాలకు తరలిపోతుండడంతో ఆ ప్రభావం రూపాయి మారకం విలువపై పడి ప్రభావం చూపుతుందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన క్రమంలో దేశప్రజల సొమ్మును యధేశ్చగా తమ ఖాతాల్లో వేసుకుని.. బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతూ.. విదేశాలకు పారిపోతున్న కుబేరుల సంఖ్య కూడా అధికం అవుతుంది. దేశానికి తాను కాపాలాదారు అన్న ప్రధాని నరేంద్రమోడీ.. దేశ సంపదను హరించుకుని విదేశాలకు పారిపోతున్న అర్థిక నేరగాళ్లకు మాత్రం అండదండలు అందిస్తూ సహకరిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి.

వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలోనే మరో వ్యాపారవేత్త కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులకు పంగనామాలు పెట్టి ప్రజాసొమ్ముతో విదేశాలకు చెక్కేశాడు. బ్యాంకులకు శఠగోపం పెట్టిన ఈ అర్థిక నేరగాడిపై సిబిఐ విచారణ ప్రారంభమవుతుందన్న క్రమంలో కుటుంబంతో సహా విదేశాలకు పారిపోవడం గమనార్హం. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర భారత్ నుంచి నైజీరియాకు చెక్కేశాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా జారుకోవడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.

గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో నితిన్ తో పాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతని కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీలు కేసును నమోదుచేశాయి. దీంతో విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తొలుత నితిన్ ను దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల (ఎక్కడా ఆఫీస్ ఉండదు.. కేవలం కాగితాల మీదే కనపడతాయి) ద్వారా దేశవిదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను జప్తు చేసింది. కాగా, ప్రస్తుతం నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్ కు రప్పించేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసే అవకాశముందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నైజీరియాతో భారత్ కు ఖైదీల అప్పగింత ఒప్పందం లేనందున, వీరి అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే ఇంగ్లాండ్ లో ఆశ్రయం పోందుతున్న మరో అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా … తాను దేశం విడిచే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చానని ప్రకటించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో నేతల అండదండలతోనే మాల్యా, నీరవ్ మోదీ, నితిన్ సందేశర లాంటి ఆర్థిక నేరగాళ్లు దర్జాగా దేశం విడిచి వెళ్లిపోతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. వేలకోట్లు ప్రజాధనాన్ని వీరు లూటీ చేస్తున్నా.. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు సామాన్యులకు వర్తించినట్టుగా అర్థిక నేరగాళ్లకు వర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోడీ అక్రమార్కుల ద్వారా విదేశాలకు నల్లధనాన్ని తరలిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank fraud  cbi  ED  Gujarat businessman  Nitin Sandesara  Sterling Biotech  crime  

Other Articles