home guard inappropriately touching school girls పోకిరి పోలీసు.. కామాంధుడికి ఎక్కువే..

Home guard inappropriately touching women and girls on busy street

home guard molestation, crime against women in kochi, home guard molesting women in kochi, molestation, police, home guard, viral video, kochi, kerala, crime, video viral

In a disturbing incident, a Kochi home guard was caught on camera inappropriately touching women and even schoolgirls on a busy street. A video depicting his act went viral on social media.

ITEMVIDEOS: పోకిరి పోలీసు.. కామాంధుడికి ఎక్కువ.. మీరే చూడండీ

Posted: 09/21/2018 02:40 PM IST
Home guard inappropriately touching women and girls on busy street

ఈవ్ టీజింగ్, అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసే పోకిరీలను కటకటాల వెనక్కి నెట్టి.. వారికి తామున్నామన్న భరోసాను కల్పించేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కింది స్థాయి సిబ్బందిపైనే వుంటుంది. అలాంటి బాధ్యతలను నిర్వహిస్తున్న ఓ దిగువస్థాయి సిబ్బంది.. తన వంటిపై ఖాకీ దుస్తులు ఉన్నాయన్న సోయి కూడా మర్చిపోయి మరీ ఏం చేస్తున్నాడో చూస్తే.. అవేశం కట్టలు తెంచుకోకతప్పదు.

బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో భాగంగా ఉండి, మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన ఓ హోమ్ గార్డు, విధులు నిర్వహిస్తూ, తనలోని కామాంచకు తెరలేపాడు. కొచ్చిలో అత్యంత రద్దీగా వుండే తివారాలో ఓ చర్చి ముందు వీధిలో విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ అనే హోమ్ గార్డు, అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించగా, అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో దీన్ని తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

దీంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, సదరు హోమ్ గార్డు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, సీటి పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : molestation  police  home guard  viral video  kochi  kerala  crime  

Other Articles