child declared not dead during autopsy చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ప్రైవేటు డాక్టర్లు..

Child declared not dead during autopsy

snake bite, rishitha, goolla sadanandham, private doctor, hawaldhar pally, bhimadevera pally, warangal urban, telangana

Parents who went for an autopsy of their girl child to MGM Hospital was declared not dead and sent to ICU for Treatment, who was declared dead by private doctors

చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ప్రైవేటు డాక్టర్లు..

Posted: 08/22/2018 12:00 PM IST
Child declared not dead during autopsy

వైద్యులను దేవుళ్లుగా భావించే సగటు మనిషి తత్వమే.. వారిని స్వార్థపరులుగా మారుస్తుందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. డాక్టర్ల అదాయాం తమకు రావాలనో ఎలా మరెందుకో కానీ నకిలీ డాక్టర్ల అవతారాలు ఎత్తుతున్నవాళ్లు కూడా సమాజంలో వున్నారు. ప్రజల ప్రాణాలను పన్నంగా పెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వైద్యులకు అసులు ఏం జరుగుతుందో తెలియదు. దీంతో అనవసర తలనోప్పులు జోలికి వెళ్లకుండా తమ పని తాము కానిచ్చేద్దామని భావిస్తూ కూడా వీరు ప్రజల ప్రాణాలను బలిచేస్తున్నారు.

ఇలాంటి వైద్యులే పాటుకాటుకు గురైన చిన్నారి మరణించిందని చెప్పి.. అమె ప్రాణాలను హరించారు. వైద్యం తెలియని నకిలీలో.. లేక తమకు ఇబ్బందులు ఎందుకనుకున్న వైద్యులో.. చిన్నారిని పరీక్షించి మరణించిందని చెప్పడమే అమె ప్రాణాలు పొవడానికి కారణమైంది. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటూ ఆసుపత్రికి వెళితే, బతికుండగానే చనిపోయిందని చెప్పి, శవపరీక్షకు పంపడమే అమె ప్రాణాలను తీసింది. ఇందుకు కారణం పూర్తిగా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని హవల్దార్ పల్లికి చెందిన గూళ్ల సదానందం కుమార్తె రిషిత (13). 19వ తేదీ రాత్రి ఆమె నిద్రిస్తుండగా, ఓ పాము కరిచింది. వెంటనే ముల్కనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రిషితను తీసుకెళ్లి, ఆపై మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో, హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు బాలిక మరణించిందని చెప్పడంతో విలవిల్లాడిపోయారు.

శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించడంతో, పోస్టుమార్టం వేళ, పాప ఇంకా బతికే ఉందని గుర్తించిన వైద్యులు, అత్యవసర చికిత్స చేసినప్పటికీ, ఫలించలేదు. అప్పటికే విషం శరీరమంతా వ్యాపించగా, నిన్న సాయంత్రం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మల్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ప్రాణాలను హరిస్తే.. వారిపై అగ్రహావేశంలో చిన్నారి బంధువులు దాడి చేస్తే.. కేసులు బనాయించి కన్నీళ్ల మధ్యనున్న కుటుంబ సభ్యులను కటకటాల పాలు చేస్తారు. మరీ ఇలాంటి వైద్యులపై చర్యలు ఎవరు తీసుకుంటారు. అసలు ఇలాంటి వైద్యులను జీవితాంతం వైద్యం చేయనీయకుండా చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles