Imran Khan takes oath as 22nd PM of Pakistan పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం..

Imran khan swearing in pti chief takes oath as 22nd pm of pakistan

PM of pakistan 2018, imran khan oath, imran khan oath taking, navjot singh sidhu, imran khan news, Imran Khan swearing in, Imran Khan Pakistan, Pakistan PM oath taking, imran khan wazir e azam, imran khan halaf, Imran Khan Oath Ceremony, Pakistan PM, Pakistan Prime, International, politics

Pakistan Tehreek-e-Insaf (PTI) chairman Imran Khan has been sworn-in as the 22nd Prime Minister of the country at Aiwan-e-Sadr (the President House) in Islamabad

పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం.. హాజరైన సిద్దు

Posted: 08/18/2018 04:56 PM IST
Imran khan swearing in pti chief takes oath as 22nd pm of pakistan

పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ 22వ ప్రధాన మంత్రిగా ఆయన దేశవిదేశీ అతిరధ మహారధుల మధ్య ప్రమాణస్వీకారోత్సవాన్ని చేశారు. తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేతగా పార్టీని స్థాపించిన నాటి నుంచి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన ఆయన పలు చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అతిరధుల సమక్షంలో ఆయన ప్రధానిగా ప్రెసిడెంట్ హౌస్‌లో బాధ్యతలు స్వీకరించారు.

అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఇమ్రాన్ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రికెటర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్.. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి తన సొంత పార్టీని స్థాపించారు. ఇమ్రాన్ ఖాన్ సమకాలికుడైన క్రికెటర్.. ఆ తరువాత ఇమ్రాన్ మాదిరిగానే రాజకీయాల్లోకి వచ్చిన భారత మాజీ క్రికెటర్.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. ఇందుకోసం ఆయన వాఘా సరిహద్దు ద్వారా శుక్రవారమే పాక్ చేరుకున్నారు. సిద్దూతో పాటుగా వసీం అక్రమ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, సైన్యానికి చెందిన అత్యున్నత అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

కాగా, ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధూను పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కన కూర్చోబెట్టడం గమనార్హం. విదేశీ నేతల సరసన సిద్ధూను కూర్చోబెట్టకుండా.. పీవోకే పాలకుడి పక్కన కూర్చోబెట్టడం విమర్శలకు తావు ఇస్తోంది. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ బజ్వాను సిద్ధూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘నేను ఇక్కడికి రాజకీయ నాయకుడిగా రాలేదు. భారత సహృద్భావ రాయబారిగా వచ్చా’నని సిద్ధూ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM  Pakistan  imran khan  oath taking  swearing in ceremony  navjot singh sidhu  India  International  

Other Articles