Rajiv Gandhi is the reason I am alive said Vajpayee రాజీవ్ గాంధీ వల్లే బతికున్నాను: వాజ్ పేయి

Vajpayee had called rajiv gandhi his younger brother and saviour

Atal Bihari Vajpayee, Rajiv Gandhi, Kidney treatment, Rahul Gandhi, UN delegation, Battle with Death, atal bihari vajayee funeral, Atal Bihari Vajpayee, BJP, krishna menon marg, Mohan Bhagwat, Narendra Modi, Vajpayee, vajpayee death

Former prime minister Rajiv Gandhi had died in May 1991, Atal Bihari Vajpayee had said that it was like losing his younger brother to death and also that had it not been for Rajiv Gandhi's magnanimity, he (Vajpayee) would not have been alive. That remark of Vajpayee actually carries a very poignant tale behind it.

రాజీవ్ గాంధీ తన తమ్ముడన్న అటల్ జీ.. ఎందుకు.?

Posted: 08/17/2018 01:15 PM IST
Vajpayee had called rajiv gandhi his younger brother and saviour

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి చెందిన నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఔనత్యం గురించి దేశప్రజలు అసక్తిని కనబరుస్తున్నారు. ఆయన వాఖ్ఛాతూర్యం, పద వినియోగం, కవిత్వాలు, వక్త కావడంతో ప్రసంగాలను కూడా వినేందుకు దేశ ప్రజలు అవితాసక్తిని కనబరుస్తున్నారు. అయితే రాజీవ్ గాంధీని ఆయన తన సోదరుడని మరింతగా చెప్పాలంటే తన తమ్ముడని అభివర్ణించారని అంతేకాక తన ప్రాణప్రధాతగా నిలిచారన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి.

రాజకీయాల్లో విలువ వలువలకు వన్నె తెచ్చిన ఆయన ప్రత్యర్థి నేతను కూడా సోదర సమానుడని అభివర్ణించడం.. ప్రాణప్రధాతగా కొనియాడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక పెద్ద కథే వుంది. ఇది కూడా రాజీవ్ గాంధీ మరణించిన నేపథ్యంలో స్వయంగా వాజ్ పేయ్ రాజీవ్ గాంధీకి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ సందర్భంలోనే ఈ విషయాన్ని బయటపెట్టారు. తాను బతికి ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ వల్లేనని వాజ్‌పేయి పేర్కొన్నడంతో అప్పట్లో ఈ విషయం పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా ఇప్పుడు మాత్రం నెట్టింట్లో సంచలనంగా మారింది.

వీరిద్దరి మధ్య ఆ అవినాభావ సంబంధం ఎలా ఏర్పడిందని అంటే.. వాజ్ పేయి వెలువరించే వరకు ఈ విషయం బీజేపి నేతలకే కాదు ఆయన సన్నిహితులకు కూడా తెలియదు. అసలేం జరిగింది.? అంటే.. రాజీవ్ గాంధీ ప్రధానిగా కొనసాగిన హయాం 1984-89లో అప్పటి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వాజ్ పేయి.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1988లో వాజ్ పేయి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. విదేశాల్లో చికిత్స చేయించుకుంటే తప్ప కష్టం. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాజ్‌పేయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి తెలిసింది.

విషయం తెలిసిన వెంటనే వాజ్‌పేయిని తన కార్యాలయానికి రమ్మని రాజీవ్ ఆహ్వానించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు వెళ్లే బృందంలో మిమ్మల్ని కూడా చేర్చుతున్నానని, కాబట్టి సదస్సు అనంతరం న్యూయార్క్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని వాజ్‌పేయికి సూచించారు. దీనికి వాజ్‌పేయి సరేననడంతో అలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని వాజ్‌పేయి స్వయంగా సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్‌తో పంచుకున్నారు. తానీ రోజు బతికి ఉన్నానంటే దానికి కారణం రాజీవ్ గాంధీయేనని వాజ్‌పేయి పలుమార్లు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles