Pawan Kalyan compares Lokesh with KTR కేటీఆర్ తో నారా లోకేష్ ను పోల్చిన పవన్ కల్యాణ్

Pawan kalyan compares lokesh with ktr

Jana sena, Pawan Kalyan, Jana Sena Party chief, TDP future leader, AP future CM, Telangana uture CM, TRS future boss, nara lokesh, KTR, Telanagana, Chief Minister, Party boss, TDP. TRS, KT RamaRao, Chandrababu, K chandrashekar rao, Telangana, Andhra pradesh, special status, andhra pradesh, politics

Jana sena chie Pawan Kalyan again targeted Nara Lokesh, and compared him with KTR and told while KTR has the eligibility to become CM, but Lokesh doesn’t have such eligibility.

కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హత.. మరీ లోకేష్ కు.?: జనసేనాని

Posted: 08/16/2018 02:01 PM IST
Pawan kalyan compares lokesh with ktr

జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులను టార్గెట్ చేశారు. రానున్న ఎన్నికలలో తమ తండ్రుల మాటు నుంచి అధికారాన్ని అందుకోవాలని ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులు యోచనలో వున్నారని అన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడికి ఆ పదవిని అందుకునేందుకు అన్ని అర్హతలు వున్నాయని అంటూనే.. చంద్రబాబు తనయుడిపై మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రాజకీయ నాయకులు ప్రజల్లోంచి రావాలని, అప్పుడే వారికి ప్రజల కష్టాలు అర్థమవుతాయని చెబుతున్న పవన్ కల్యాణ్.. తెలంగాణ యువ మంత్రి కేటీఆర్ తో ఏపీ యువ మంత్రి నారా లోకేశ్ లను పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు తెలుసుకుని, ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వారే రాజకీయాల్లోకి రావాలని వ్యాఖ్యానించిన ఆయన, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ముందుండి పోరాడిన నేతగా కేటీఆర్ కు అనుభవం ఉందని అన్నారు.

ప్రజల మనసులను గెలిచిన ఆయనకు ముఖ్యమంత్రి అయ్యేందుకు కావాల్సిన అనుభవం ఉందని పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్ కు ఏం అనుభవం ఉందని ప్రశ్నించిన పవన్, ఏ అర్హతతో ఆయన సీఎం అవాలని అనుకుంటున్నారని అడిగారు. లోకేశ్ తాత ఎన్టీఆర్ కూడా 60 ఏళ్లు దాటిన తరువాత మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో తన పార్టీకి బలం ఉందని భావించిన చోట్ల తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలుపుతామని వ్యాఖ్యానించిన పవన్, మిగతా ప్రాంతాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  nara lokesh  KTR  Telanagana  Chief Minister  Party boss  TDP. TRS  andhra pradesh  

Other Articles