Mumbai MBA graduate held in ATM fraud అయినింటి అమ్మాయి.. అయినా ఏటీఎం మోసాలు..

Mumbai mba graduate held in atm fraud

Mumbai MBA graduate held in ATM fraud, atm fraud, Sudeep Goenka, Ayasha Qazi, Mohammed Hussain Hakam, Mohammed Faizan, civil engineer, Bhiwandi, Mumbai. hotel records, Bhopal, Mumbai MBA graduate, ATM fraud case, bitcoin, crime

The state cyber cell arrested a 27-year-old woman from Mumbai, who is allegedly a member of a high-profile inter-state gang of fraudsters involved in making ATM card clones.

అయినింటి అమ్మాయి.. అయినా ఏటీఎం మోసాలు..

Posted: 07/30/2018 02:56 PM IST
Mumbai mba graduate held in atm fraud

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరుగుతున్న ఏటీఎం మోసాల కేసులో ముగ్గురు సభ్యుల ముఠా వుందని తెలుసుకున్న పోలీసులు ఈ మోసాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు మాత్రం దుబాయ్ కి పారిపోయాడని తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసులో మూడు ఏటీఎం కేంద్రాల వద్ద జరిగిన మోసాల్లో ఓ అమ్మాయి పాత్ర కూడా వుందని అప్పటికే సేకరించిన సమాచారంతో అమెను అదుపులోకి తీసుకున్నారు. అమెను కోర్టులో హాజరుపర్చిన నేపధ్యంలో న్యాయస్థానం అమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

ఈ క్రమంలో అమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. అమె ఏకంగా ఓ అయినింటి (సంపన్న కుటుంబానికి చెందిన) యువతిగా గుర్తించారు. అమె తండ్రి ఓ రిటైర్డు సివిల్ ఇంజనీర్ అని కూడా తెలుసుకున్నారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆయన బిల్డర్ గా కూడా పదవీ విరమణ తరువాత కూడా చక్కగా అర్జిస్తున్నాడని తెలుసుకున్నారు. ఇక నెలకు యాభై వేల రూపాయలను ఆయన తన కూతురుకి పాకెట్ మనీగా ఇస్తున్నాడని కూడా తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.

ఇక యువతి తల్లి కూడా ఓ ప్రోఫెసర్ అని తెలుసుకున్న పోలీసులు ఇలాంటి యువతి ఎందుకని దోంగతనాలకు పాల్పడిందన్న కోణంలో విచారించగా.. అమె చెడు వ్యసనాల కారణంగానే వక్రమార్గం పట్టిందని తెలుసుకున్నారు పోలీసులు. అమెకు మొదటగా పరిచయమైన మహమ్మద్ హుస్సేన్ హకాం.. అమెను ఏటీఎం మోసాల కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఫైజాన్ తో పరిచయం చేశాడు. దీంతో వీరంతా కలసి ఏటీఎం మోసాలకు స్కేచ్ వేసి.. ముంబైకి దూరంగా వున్న భోపాల్ లోని గుల్మొహర్ కాలనీలో ఈ మోసాలకు పాల్పడ్డారు.

స్కిమ్మర్ లు, కెమెరాలు అమర్చి డెబిట్ కార్డులను క్లోనింగ్ చేసి, 73 మంది ఖాతాదారుల నుంచి రూ. 17 లక్షలకు పైగా ఈ ముఠా దోపిడీ చేసింది. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి అయిన ఫైజన్ మోసాలకు పాల్పడగా, హకం మాత్రం ఏటీయం కేంద్రాలలో అర నిమిషంలో స్కిమ్మింగ్ మిషన్ల్, పాస్ వర్డ్ తెలుసుకునేందుకు అద్దాన్ని ఏర్పాటు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక హోటల్ రికార్డుల ప్రకారం ముంబై ప్రముఖ కాలేజీ నుంచి ఎంబీఏ పొందిన అయాషా ఖాజీ గా గుర్తించామన్నారు. అమె మాదకద్రవ్యాలకు బానిసై చదువుకోసం తన తండ్రి పంపిన డబ్బులన్నింటినీ ఖర్చుచేసిందని దీంతో ఏటీఎం మోసాల ముఠాలో సభ్యురాలిగా మారిందని కూడా తెలుసుకున్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atm fraud  Bhopal  Mumbai  MBA graduate  ATM fraud case  bitcoin  crime  

Other Articles