Congress’ floor strategy for no-confidence motion మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై దిక్కులు పిక్కటిల్లాలి: సోనియా

Congress to attack center raise issues that are difficult to counter during no confidence motion

No confidence motion, Monsoon Session 2018, Parliament, Trust vote, Narendra Modi, Narendra Modi government, Indian National Congress, National Democratic Alliance, Bharatiya Janata Party, Sonia Gandhi, Rahul Gandhi

The Congress parliamentary party met on Thursday morning to finalise the strategy for the debate on the crucial no-confidence motion against the Narendra Modi government, to be taken up tomorrow in the Lok Sabha.

మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై దిక్కులు పిక్కటిల్లాలి: సోనియా

Posted: 07/19/2018 12:02 PM IST
Congress to attack center raise issues that are difficult to counter during no confidence motion

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టడానికి తమకు తగిన సంఖ్యాబలం కూడా లేదన్న బీజేపి నేతల విమర్శలను తోసిపుచ్చిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ.. తమకు తగిన బలం వుందని.. ఎవరు తమకు బలం లేదని వ్యాఖ్యానించారన్న ఎదురు ప్రశ్నించారు.

అంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై తమ యూపీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో పదేళ్లు ఇచ్చేందుకు సిద్దమయ్యిందని.. అనేక విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలు, పరిశ్రమలు, పోర్టు అభివృద్ది, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అనేక అంశాలపై చర్చించి వాటన్నింటినీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చామని కూడా చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో అన్ని విధాలుగా తూర్పారబట్టాలని సూచించారు. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రజా సమస్యలను ఎత్తి చూపి.. మోడీ ప్రభుత్వ విధానాలను పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలని సోనియాగాంధీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వ తీరును, వారు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర నిర్ణయాలతో ప్రజలకు ఎదుర్కోంటున్న బాధలను పార్లమెంటు సహా అష్ట దిక్కులు పిక్కటిల్లేలా ఎండగట్టడానికి అమె సూచించారు. ఈ చర్చను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహాలను, కేంద్రాన్ని ఎండగట్టే అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికితోడు, వివిధ పార్టీల మద్దతును కూడగట్టడం, విపక్షాలను ఒక్క తాటిపైకి తీసుకురావడం వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. దీంతో, ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : No confidence motion  Parliament  Narendra Modi  Congress  NDA  BJP  Sonia Gandhi  Rahul Gandhi  politics  

Other Articles