Karnataka CM Slams Media Again కేంద్రానిదైతే అమోదం.. రాష్ట్రానిదైతే అనర్థమా.? సీఎం ప్రశ్న

Karnataka cm hd kumaraswamy slams media again in bengaluru

karnataka cm fires on media, cm kumaraswamy questions media, karnataka cm on petrol price hike, karnataka cm on diesel price hike, karnataka cm on lpg gas price hike, bs yeddyurappa, vajubhai wala, congress, JDS, priyanka chaturvedi, kumaraswamy, PM Modi, union government, petrol, diesel, gas, JDS, BJP, karnataka, politics

Despite mounting pressure from the Congress to roll back the hike in petrol and diesel prices, Kumaraswamy, who also holds the finance portfolio, stuck to his decision.

ITEMVIDEOS: వాళ్లు పెంచితే అమోదం.. మేము పెంచితే అనర్థమా.? సీఎం నిలదీత

Posted: 07/14/2018 06:24 PM IST
Karnataka cm hd kumaraswamy slams media again in bengaluru

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఒకింత నిజాలు మాట్లాడారు. అయితే ఆ నిజాలు కాస్తా నిప్పులు మాదిరిగా మీడియాకు తగిలాయి. అదేంటి అంటారా..? కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా 11 రూపాయల మేరక పెరిగినా పెదవి విప్పని మీడియా.. తన ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేసేందుకు, రాష్ట్రంలో అన్ిన వర్గాల ప్రజలకు సంక్షేప పథకాలను ప్రవేశపెట్టేందుకు పెంచిన నేపథ్యంలో మీడియా కథనాలను ప్రచురించిన క్రమంలో ఆయన మాట్లాడిన తీరు.. మీడియాను అగ్గిమీదగుగ్గిలం అయ్యేలా చేసింది.

పదకొండు రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన ప్రధాని నరేంద్ర మోదీని ఒకలా చూపిస్తూ, రూపాయి మాత్రమే పెంచిన తనను మరోలా చూపిస్తూ మీడియా కథనాలపై ఆయన తీవ్రస్థాయిలో మనస్తాపం చెందారు. దీంతో రూ.11 పెంచిన ప్రధాని మీకు దేవుడు.. రూ.1 పెంచిన నన్ను ప్రజల ముందు విలన్ లా నిలబెడతారా.? అని ఆయన మండిపడ్డారు. ఇవాళ బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ పై అధిక పన్ను ఎందుకు వేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

దీంతో మీడియాపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పెట్రోల్ మీద మోదీ రూ. 20 పెంచినప్పుడు మీడియా ఎందుకు సైలెంట్ గా ఉందని ఆయన ప్రశ్నించారు. వంట గ్యాస్ సిలిండర్ మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 300 పెంచినా మీడియా మౌనంగా ఉందని... రెండు నెలలు కూడా నిండని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తోందని మండిపడ్డారు. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumaraswamy  PM Modi  union government  petrol  diesel  gas  JDS  BJP  karnataka  politics  

Other Articles