police rescued 32 young girls from bengaluru pub ఇందిరానగర్ పబ్ లో యువతుల అర్థనగ్న నృత్యాలు

32 women allegedly forced into obscene acts rescued from bengaluru pub

indiranagar, Bengaluru pub, Indiranagar Pub, police Raid, bengaluru police, young girls rescued, six arrested, 32 women rescued, indecent dance, obscene acts, crime

Thirty two women were rescued from a pub in Bengaluru's Indiranagar after police conducted a raid. Six people were arrested.

ఇందిరానగర్ పబ్ లో యువతుల అశ్లీల నృత్యాలు..

Posted: 07/05/2018 11:22 AM IST
32 women allegedly forced into obscene acts rescued from bengaluru pub

బెంగళూరులో యువతుల చేత బలవంతంగా అసభ్యకర చేష్టలు చేయించడం, అర్థనగ్నంగా డాన్సులు చేయించడం వంటి పనులు చేయిస్తున్న అరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు మహానగరంలో పబ్బులు, నైట్ క్లబ్ లు, రెస్టారెంట్లు అధికంగా ఉండే ఇందిరానగర్ పరిధిలోని 80 ఫీట్ రోడ్ లోని ఓ పబ్బులో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పక్క సమాచారం అందుకున్న పోలీసులు నిర్వహించిన అకస్మిక దాడిలో 32 మంది యువతులు అసభ్యంగా అశ్లీల పనులు చేస్తూండటాన్ని రెడ్ హ్యండెండ్ గా పట్టుకున్నారు.

32 మంది అమ్మాయిలతో తమకు తెలిసిన పబ్ లలో వీరితో ఇలాంటి పనులు చేయించి తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. 32 మంది యువతులతో పాటు వారితో అసాంఘిక కార్యకాలాపాలు చేయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బెంగళూరు డిప్యూటీ కమిషనర్ అజయ్ హిలోరీ వెల్లడించారు. పబ్బు నిర్వాహకులపై కేసులు పెట్టామని తెలిపారు. పబ్బుపై దాడికి పోలీసులు వెళ్లేసరికి 32 మంది అమ్మాయిలు అసభ్యంగా కనిపించే దుస్తులు ధరించి, అశ్లీల నృత్యాలు చేస్తూ, చట్ట వ్యతిరేకంగా కనిపించారని ఆయన వెల్లడించారు. ఈ పబ్ లో అశ్లీల నృత్యాలపై సమాచారం అందుకుని దాడి చేశామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengaluru pub  Indiranagar Pub  police Raid  bengaluru police  indecent dance  obscene acts  crime  

Other Articles