atm does not dispences cash, man vandalises ఏటీయంలో డబ్బులు లేక.. వ్యక్తి విపరీత నిరసన

Man shows his protest this way after atm does not dispences cash

man hits atm screen with stone in hyderabad, man protest, man anger, man atm center, pnb atm chandanagar, pnb atm seri lingampally, pnb atm hyderabad, pnb atm telangana

A Man with helmet entered into the PNB atm center at seri nallagandla at seri lingampally of hyderabad city and breaks its screen after it does not dispences cash.

ఏటీయంలో డబ్బులు లేక.. వ్యక్తి విపరీత నిరసన

Posted: 06/14/2018 11:26 AM IST
Man shows his protest this way after atm does not dispences cash

నోట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఏ సమయంలో పూనుకుందో కానీ.. దానిని అమలు చేసినప్పటి నుంచి దేశంలో కరెన్సీ కొరత అన్న మాట వినిపించడం ప్రారంభించింది. మూడు మాసాలు ఓపిక పడితే చాలు అని అన్న సమస్యలు తొలగిపోతాయని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేసిన తరువాత కూడా ఏడాదిన్నర అయినా ఇంకా కరెన్సీ కష్టాలు మాత్రం తిరలేదు. మా డబ్బును మేము బ్యాంకుల్లో దాచుకుని.. దానిని తీసుకునేందుకు కూడా పలు అంక్షలను అమల్లోకి తేవడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతూనే వున్నాయి.

ఇక మధ్యలో కొంతకాలం పాటు పన్వాలేదని అనిపించినా.. ఆ తరువాత మళ్లీ నోట్ట కష్టాలు తెరపైకి రావడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తమ నిరసనను ఆగ్రహాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక నగరశివారల్లోని ఓ వ్యక్తి ఏకంగా ఏటీయం కేంద్రంలోని యంత్రంపైనే తన ప్రతాపాన్నిచూపాడు. డబ్బులు రాకపోవడంతో చివరకు దాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

చందానగర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ తిరుపతిరావు కథనం ప్రకారం... నల్లగండ్ల సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఓ ఏటీఎం ఉంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి క్రితంరోజు రాత్రి డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వచ్చాడు. కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేశాడు. ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో, క్యాష్ రాలేదు. దీంతో, సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. రాయితో ఏటీఎం స్క్రీన్ బద్దలు కొట్టి వెళ్లిపోయాడు. ఏటీఎంను ధ్వంసం చేసిన వ్యక్తిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో, అతన్ని గుర్తించడం కష్టమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atm  punjab national bank  nallagandal  seri lingampally  hyderabad  chandanagar police  telangana  

Other Articles