ramana deekshitulu ready for cbi probe రమణదీక్షితులు సవాల్: సీబిఐ విచారణకు నేను రెడీ..

Ramana deekshitulu challenges ttd says he is ready for cbi probe

tirumala tirupati devasthanam, ttd temple former chief priest, ramana deekshitulu, challenge, cbi probe, ttd officials, telugu desam party, ttd chairman, putta sudhakar yadav, politics

The former chief priest of tirumala srivaru ramana deekshitulu challenged ttd officials saying that he is commited to the statements he made and is ready for cbi probe in this issue.

రమణదీక్షితులు సవాల్: సీబిఐ విచారణకు నేను సిద్దం.. మరి మీరూ..

Posted: 06/05/2018 11:15 AM IST
Ramana deekshitulu challenges ttd says he is ready for cbi probe

తిరుమల తిరుపతి దేవస్థానంలో అనర్హులకు అందలం అందిస్తున్నారని, పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారానికి పరోక్షంగా దోహదపడుతున్నారని విమర్శలు చేసి సంచలనం రేపిన రమణ దీక్షితులు ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులకుడిగా ఉద్యోగాన్ని కొల్పోయిన విషయం తెలిసిందే. అయితే 65 ఏళ్ల వయోపరిమితి అంటూ టీటీడీ హడావిడి చేసి అఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకుని అవి వెనువెంటనే అమల్లోకి వస్తాయని రమణ దీక్షితులుకు వ్యతిరేకంగా టీటీడీ పావులు కదిపింది. అయితే పాలకమండలి చర్యలతో ఖంగుతింటాడని భావించిన రమణ దీక్షితులు.. పాలకమండలితో పాటు ప్రభుత్వపెద్దలపై కూడా సంచలన అరోపణలు చేయడం మొదలుపెట్టారు.

ఇక అరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో తన అరోపణలు నిరూపణకు సిద్దమని సవాళ్లు చేసుకునే పరిస్థితి వరకు విషయం వెళ్లింది. శ్రీవారి ఆభరణాల్లో కొన్ని మాయమయ్యాయని, స్వామివారి ప్రసాదాల పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపించారని ఆరోపించారు. దీంతో ఆయనపై టీటీడీ అధికారులు, నేతలు ఎదురుదాడి ప్రారంభించిన విషయం విదితమే. అధికారులు, రాజకీయ నాయకులు తనపై చేస్తోన్న విమర్శలు, ఆరోపణలపై రమణదీక్షితులు తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని రమణదీక్షితులు స్పష్టం చేశారు.

తన వద్ద ఆదాయానికి మించి రూ.10 ఎక్కువ ఉన్నట్టు తేలినా ఏ శిక్షకైనా సిద్ధమనీ, తనపై ఆరోపణలు చేసినవారూ సీబీఐ విచారణ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ సవాలు విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా కలత చెందానని అన్నారు. భక్తులకు వాస్తవాలను తెలియాలనే ఉద్దేశంతో మీడియా ముందుకొచ్చినట్లు ఆయన వివరించారు. వెయ్యికాళ్ల మంటపాన్ని కూల్చేసినప్పుడు దానిపై తాను ఎంతగానో పోరాటం చేశానని అన్నారు. మాస్టర్‌ప్లాన్‌ కోసమంటూ మంటపాన్ని కూల్చేశారని వెల్లడించారు. వంశపారంపర్యంగా వచ్చిన ప్రాచీనమైన తన నివాసాన్ని సైతం కూల్చివేశారని వాపోయారు.

జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులపై ఆయన విరుచుకుపడ్డారు. తిరుమలలోని శ్రీవారి పోటు పక్కనున్న నేలమాళిగలో నిధులున్నట్లు 1800 నాటి బ్రిటిష్‌ మాన్యువల్స్‌లో ఉందనీ, అక్కడ కొంతకాలం కిందట తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. అక్కడ బయటపడిన నగలు మాయమయ్యాయనే అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని రమణదీక్షితులు డిమాండ్‌ చేశారు. అలాగే గులాబీ రంగు వజ్రం 2001 నుంచి కనిపించడంలేదని, తర్వాత దీన్ని విదేశాల్లో వేలం వేశారని మరోసారి ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttd temple  former chief priest  ramana deekshitulu  challenge  cbi probe  ttd officials  

Other Articles