police case filed against ravela followers రావెల అనుచరులపై కేసు.. ఉద్యోగుల అందోళన

Ravela followers beaten tahasildar in his office

ravela kishore babu, followerts, st employees, vatticherukuru mro, ramuli naik, pattabhipuram, Andhra Pradesh, crime

pattabhipuram police filed case against followers of former minister of andhra pradesh ravela kishore babu for manhandling st tahasildar ramulu naik.

మాజీ మంత్రి రావెల అనుచరులపై కేసు.. ఉద్యోగుల అందోళన

Posted: 06/02/2018 02:09 PM IST
Ravela followers beaten tahasildar in his office

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు అనుచరులు హద్దు దాటి ప్రవర్తించారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిపై తీవ్రంగా దాడి చేశారు. రావెల కార్యాలయాన్ని మండలస్థాయి మెజిస్ట్రేటుగా వ్యవయహరించే తహసీల్దార్ ను పిలిచి అతనిపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్టీ సంఘాల నాయకులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

మాజి మంత్రి రావెల కిషోర్ బాబు అనుచరులు సూర్యప్రకాశ్, నల్లూరి సుబ్బారావు, వీరయ్య చౌదరిలు స్థానికి వట్టిచెరుకూరు తహసీల్దార్‌.. రాములు నాయక్‌ తమ పనులను చేయడం లేదని, ఎంత చెప్పినా అసలు పట్టించుకోవడం లేదని అరోపిస్తూ.. ఆయనను రావెల కార్యాలయానికి పిలిపించారు. అక్కడకు చేరుకున్న రాములు నాయక్ పై పలువరు రావెల అనుచరులు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన తహసీల్దార్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

రాములు నాయక్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎస్టీ సంఘాల నాయకులు వెంటనే రావెల కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓవైపు నిరసన దీక్షలో పాల్గోనేందుకు వెళ్తున్న ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను దరించి రావెల కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు వారిని నిలువరించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravela kishore babu  st employees  

Other Articles