former cbi jd laxminarayana clarifies on joining bjp బీజేపిలో చేరిక వార్తలపై జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..

Is ex jd lakshmi narayana bjp s ap cm candidate

cbi former joint director, lakshmi narayana, bjp, chief minister candidate, bjp CM candidate, lakshmi narayan clarity, AP BJP, andhra pradesh, politics

Ex-JD Lakshmi Narayana who is touring the state, trying to understand the various problems faced by farmers, has become the hot favourite for every party.

బీజేపిలో చేరిక వార్తలపై జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..

Posted: 05/31/2018 03:54 PM IST
Is ex jd lakshmi narayana bjp s ap cm candidate

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బీజేపి పార్టీలో చేరుతున్నారని, ఆయనే ఆ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ నిన్న రాత్రి నుంచి అటు సోషల్ మీడియాలో ఇటు న్యూస్ ఛానెళ్లలో వచ్చిన వార్తలపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతోనే తాను అత్యున్నతమైన ఉద్యోగాన్ని సైతం వదులుకుని (రాజీనామా చేసి) పల్లెబాట పట్టిన ఆయన ఇంతకీ బీజేపిలో చేరుతున్నారా.? లేక మరో పార్టీలో చేరుతున్నారా.? అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీనారాయణే వారి సీఎం అభ్యర్థి అన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత రాజకీయపరంగా ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రైతులు సబ్సిడీలు, పథకాలను ఆశించడం లేదని... పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల్లోకి వచ్చానని చెప్పారు.

అయితే, ఈ మధ్య ఆరెస్సెస్ కు సంబంధించిన ఓ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. దీంతో, ఆయన బీజేపీలో చేరుతున్నానే వాదనకు మరింత బలం వచ్చింది. మరోవైపు పార్టీ గురించి, ఎన్నికల్లో పోటీ గురించి ఆయన ఇంతవరకు మాట్లాడకపోయినా... రాజకీయాల్లోకి వస్తారని మాత్రం ఆయన రాజీనామా అనంతరం వార్తలు ఊపందుకున్నాయి. కాగా బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలవడం లేదని క్లారిటీని ఇచ్చిన ఆయన.. తనకు వ్యవసాయ మంత్రిగా పని చేయాలని ఉందని గతంలో ఓసారి ఆయన చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles