Dalit man beaten to death in Gujarat దళిత వ్యక్తి ఇనుపరాడ్లతో కోట్టి చంపారు..

Dalit man beaten to death in gujarat five arrested

Gujarat, Una flogging, mukesh vaniya, jayaben vaniya, Gujarat Industrial Development Corporation, Dalit man, Dalit man beaten to death, Gujarat, Rajkot, Jignesh mevani, Una incident, Dalit man flogged, Rajkot, Gujarat, crime

Police have arrested five people for allegedly thrashing to death a 35-year-old Dalit man suspecting him to be a thief in Gujarat's Rajkot district, an official said today.

ITEMVIDEOS: గుజరాత్ లో దారుణం.. ఇనుపరాడ్లతో కొట్టి దళితుడి హత్య

Posted: 05/21/2018 07:02 PM IST
Dalit man beaten to death in gujarat five arrested

గత కొన్నేళ్ల క్రితం వరకు బీహార్ లో కోనసాగిన అటవిక రాజ్యం, కిరాకతాలకు ఇప్పుడు గుజరాత్ అడ్డాగా మారిందా.? అంటే అవుననే నిరూపించేట్టుగానే జరిగింది ఈ ఘటన. యావత్ దేశానికి గుజరాత్ మోడల్ ను చూపించి.. దేశ ప్రధానిగా ఎన్నుకోబడిన నరేంద్రమోడీ.. తన సోంత రాష్ట్రంలో అత్యంత దారుణ, కిరాతక ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు దళిత ఎంపీలు తమకు బీజేపి పార్టీ చేసింది ఏమీ లేదని సాక్ష్యాత్తు పార్టీపైనే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న క్రమంలో.. గుజరాత్ లోనే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని రాడ్లతో దారుణంగా కోట్టి చంపారు.

దళితుడిని తాళ్లతో కట్టేసి విచక్షణారహితంగా ఇనుపరాడ్లతో కొట్టి చంపిన అతి దారుణ ఘటన చోటు చేసుకుంది. ముఖేష్‌ వనియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి రాజ్ కోట్ లో చెత్త ఏరుకుని జీవనం సాగించేవాడు. నిన్న ఉదయం ఓ కర్మాగారం వైపునకు వెళ్లగా.. అతడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అని ఆరోపిస్తూ చావబాదారు. అసలు ఎందుకు కొడుతున్నారో.. ఎంతగా కొడుతున్నారన్న విఛక్షణ కోల్పోయిన ఉద్యోగులు అతిదారుణంగా దళిత వర్గానిక చెందిన వ్యక్తి అసువులు తీశారు. దెబ్బలకు తాళలేక వద్దు వద్దూ ఇక అపండీ.. తానేం తీసుకోలేదని ఎంతగా బతిమాలినా కరుణించలేదు కర్కోటకులు.

అంతేకాదు, ఆ దళితుడి భార్యపై కూడా కర్రలతో దాడి చేశారు. ముఖేష్‌ భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ తన ఫేస్ బుక్‌ ఖాతాలో పోస్ట్ చేసి, దళితులకు గుజరాత్‌ క్షేమదాయకం కాదని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని, కుల ఘర్షణలతో అమాయకులు మృతి చెందుతున్నా తమ రాష్ట్ర సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Una flogging  mukesh vaniya  jayaben vaniya  Dalit man  Rajkot  Jignesh mevani  Gujarat  crime  

Other Articles