mudragada slams chandrababu in an latest letter నిప్పుకు భయమెందుకు.? సీఎంకు ముద్రగడ ప్రశ్న..

Mudragada padmanabham slams cm chandrababu in an latest letter

kapu community leader, mudragada padmanabham, chandrababu, AP CM, open letter, court, cbi, nara lokesh, Andhra Pradesh, politics

kapu community leader mudragada padmanabham slams cm chandrababu in an latest letter, advices him not to approach court if cbi files case against him and his son minister nara lokesh.

నిప్పుకు భయమెందుకు.? సీఎంకు ముద్రగడ ప్రశ్న..

Posted: 05/04/2018 01:11 PM IST
Mudragada padmanabham slams cm chandrababu in an latest letter

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సంధించారు. కాపు కులస్థులపై ఎంతో ప్రేమ వున్నట్లు చెప్పుకున్న చంద్రబాబు.. ఉద్యమాలను ఉద్యమ నేతలను అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కాపు కులస్థుల రిజర్వేషన్ అంశాన్ని కూడా గత నాలుగేళ్లుగా నాన్చిన చంద్రబాబు.. తమ జాతీ ఉద్యమాల నేపథ్యంలో చివరాఖరున అసెంబ్లీ తీర్మాణం చేశారని, ఇక కేంద్రంతో తనకు చెడిన తరువాత పార్లమెంటుకు పంపారని మండిపడ్డారు.

ప్రజలు చంద్రబాబు మోసాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తున్నారని, అందుకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా వున్నారని, ఈ సారి ఎన్నికల ప్రజాతీర్పుతో బాబు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిపై ఏమీ చేయకముందే.. ఏ చర్యలకు ఉపక్రమించకముందే చంద్రబాబులో భయం అవహించిందని దుయ్యబట్టారు. అన్ని తనకు తానే ఊహించుకుని ముందుస్తు చర్యలను తీసుకుంటూ చంద్రబాబు అత్యంత జాగ్రత్త పడుతున్నారని అరోపించారు.

గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఈ మధ్య మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని ముఖ్యమంత్రినుద్దేశించి విమర్శించారు. మీరు నిప్పు కదా.. నిప్పుకు భయం ఉంటుందా అని ఎద్దేవా చేశారు. కేంద్రంతో నాలుగేళ్లు అంటకాగిన తరువాత ఇప్పుడు వారు మీ మాట వినడం లేదని, మీ అవినీతిని వారు సహించడం లేదని తెలుసుకుని మీ సహకరించకుండా వుంటున్నారని మీరు తిరుగుబాటు చేస్తే.. మీ అవినీతి, అక్రమాలను ప్రజలు మద్దుతు పలకాలా..? మీ వెంట రావాలా.. అంటూ ప్రశ్నించారు.

‘ ఏ ఘనకార్యం చేశారని ప్రజలు మీ వెనుక ఉండాలని కోరుకుంటున్నారు. మీ వెనకాలే ఉంటే మీ మాదిరిగానే అక్రమ కేసులు తప్ప అమాయక ప్రజలకు దిక్కెవరు. మీ కుమారునిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఎందుకు సవాల్ చేయలేకపోతున్నారు. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి సవాలు విసరకపోతే చరిత్రహీనులు కావడం తధ్యం. ఒకవేళ మిమ్మల్ని, మీ కుమారుడు నారా లోకేష్‌ని అరెస్టు చేస్తే..కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దని నా సలహా’  అని లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapu community leader  mudragada padmanabham  chandrababu  Andhra Pradesh  politics  

Other Articles