pawan kalyan old video gets viral on net నెట్టింట్లో జనసేనాని పవన్ పాత వీడియో వైరల్..

Pawan kalyan old video gets viral on net

pawan kalyan, janasena, pk fans, pawan kalyan viral video, janasena activists, casting couch, kathua, asifa, unnao, viral videos, videos viral, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan old video gets viral on social media, in which he suggests his fans to be patient even if someone critises him.

ITEMVIDEOS: నెట్టింట్లో జనసేనాని పవన్ పాత వీడియో వైరల్..

Posted: 04/17/2018 11:26 AM IST
Pawan kalyan old video gets viral on net

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను దేశంలో ఉన్నావో, కతువా ఘటనపై హైదరాబాద్ నగరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా బాధితులు చట్టాలను అసరా చేసుకుని పోరాడాలని, అలా పోరాడే వారికి తన మద్దుతు వుంటుందని కూడా చెప్పారు. అయితే ఈ సమస్యపై పవర్ స్టార్ తగిన విధంగా మాట్లాడలేదని.. ఈ సమస్యను జఠిలం చేయకూడదన్న విధంగా వ్యవహరించారని పలువురు క్యారెక్టర్ నటుడు అయనను టార్గెట్ చేశారు. అనక క్షమాపణలు కూడా చెప్పారు. ఇదే క్రమంలో నటి శ్రీరెడ్డి కూడా తన స్థాయిని మరచి మరీ విమర్శలు చేసి నాలుక కర్చుకుని.. క్షమాపణలు చెప్పింది.

దీంతో ఓ వైపు జనసేనానిపై కామెంట్స్ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టాలీవుడ్ అన్నది ఓ పరిశ్రమ.. ఇక్కడ జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ అన్న సమస్య అక్కడి నటీమణులకు పెద్దది కావచ్చు. అయితే రాష్ట్రం అన్నది అంతకన్నా పెద్దది. ఓ వైపు ప్రత్యేక హోదా కోసం ఆయన ముమ్మర ప్రణాళికలు రచించి.. రాష్ట్రంలో అన్ని వర్గాల అకాంక్ష దిశగా సాగుతుంటే.. అయనను టార్గెట్ చేసిన మహిళా నటుటు విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసం అంటూ పవన్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.

ఇక మరికోందరు ఈ విమర్శల నేపథ్యం వెనుక కూడా కొన్ని రాష్ట్ర కాంక్ష లేని అతీత శక్తులు ఆయనకు వ్యతిరేకంగా మహిళా నటులను ప్రేరేపిస్తున్నాయని.. విమర్శిస్తున్నారు. బహిరంగంగా మనం హీరోయిన్ల వెంట పడం.. వాళ్లే మన వెంట పడాలి అంటూ వ్యాఖ్యలు చేసిన నటులను వదిలేసి.. ఇప్పటికే రాజకీయాల్లో వచ్చిన పదవులను అనుభవిస్తున్న నేతలను పక్కనబెట్టి.. కేవలం పవన్ ను మాత్రమే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక కూడా కొందరు పనిగట్టుకుని వారిని తెరవెనుక ప్రేరేపిస్తూ.. అనందం పోందుతున్నారన్న అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరికొందరు ఫ్యాన్స్ ఆయన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. "ఒక్కోసారి నన్ను తిడుతుంటే అది మీకు అందరికీ ఇబ్బంది కలిగించవచ్చు. నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం. భరిద్దాం. భరించినవాడే సాధించగలడు. అంతేగానీ మనం... మాట అనేశారు అనిచెప్పి పారిపోతే ఎట్లా? అలా పారిపోవద్దు దేన్నుంచీ. అలాగని చెప్పి ఎదురుదాడి చేయవద్దు. భరించండి. అలా చూడండి. ఎంతసేపు అంటుంటే అంతసేపు చూడండి. మార్పు దానంతట అదే చాలా సైలెంట్ గా వచ్చేస్తుంది. భరించడం వల్ల చాలా బలమైన శక్తి లోపలి నుంచి వస్తుంది. మనం తప్పు చేయకుండా, మనల్ని అంటుంటే, చాలా బాధ ఉంటది. చాలా కోపం ఉంటది. చాలా ఆవేదన ఉంటది. నాక్కూడా కచ్చితంగా ఉంటుంది. చాలా బాధ ఉంటుంది. భరిద్దాం" అని పవన్ జనసేన కార్యకర్తల ముందు చేసిన ప్రసంగం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles