Mecca Masjid blast case accused acquitted మక్కా మసీదు కేసు కొట్టివేసిన న్యాయస్థానం..

Mecca masjid blast case all accused acquitted by nampally special nia court

mecca masjid blast, mecca masjid blast verdict, mecca masjid blast verdict live updates, mecca masjid verdict, mecca masjid judgment, swami aseemanand, nia, Mecca Masjid, CBI, aseemamand, 2007 masjid blast, hyderabad

After eleven years, NIA special court in Nampally, Hyderabad has acquitted all of the accused in the Mecca Masjid case today.

మక్కా మసీదు కేసులో ఐదుగురు నిందితులు.. నిర్దోషులు

Posted: 04/16/2018 12:18 PM IST
Mecca masjid blast case all accused acquitted by nampally special nia court

ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. తొమ్మిది మందిని బలితీసుకుని.. 58 మందిని గాయాలపాలు చేసి వారి జీవితాల్లో అతి భయానక ఘటనగా మారేలా చేసిన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులను కోర్టు కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేస్తుందన్న భావనలో ఉన్న బాధితులకు చివరకు నిరాశే మిగిలింది. పదకొండేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది.

నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాషిక్యూషన్ విఫలమైందని చెబుతూ నాంపల్లిలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేసింది. నిందితులుగా ఉన్న దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసీమానంద, భరత్ భాయి, రాజేందర్ చౌదరిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విచారణ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఐదుగురు నిందితులనూ నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఎన్‌ఐఏ.. హైక్టోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటలకు సరిగ్గా మధ్యాహ్నం నమాజ్ చేసుకునే సమయంలో చార్మినార్‌ సమీపంలోని 17వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) బాంబు పేలడంతో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు సంభవించిన అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతిచెందారు.

తొలుత హుస్సేనీఆలం పోలిస్ స్టేషన్లో కేసులు నమోదయినా.. ఉగ్రవాద దుశ్చర్య కావడంతో భారత హోంమంత్రిత్వ శాఖ కేసు దర్యాప్తు బాధ్యతను 2011 ఏప్రిల్‌ 4న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి అప్పగించింది. అప్పట్లో రెండు కేసుల్ని తిరిగి నమోదు చేసిన ఎన్‌ఐఏ మొత్తం పదిమంది నిందితుల్ని గుర్తించింది. సీబీఐ ఒకటి, ఎన్‌ఐఏ రెండు అభియోగపత్రాల్ని న్యాయస్థానంలో నమోదు చేశాయి. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఎన్‌ఐఏ.. 10 మందిని నిందితులుగా చేర్చగా, వారిలో ఒకరు మృతి చెందారు. కాగా నలుగురిపై విచారణ కొనసాగుతోంది. మిగతా ఐదుగురిపై సాక్ష్యాధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles