Nirav Modi arrested in Hong Kong ప్లాష్.. ఫ్లాష్.. హాంకాంగ్ లో నిరవ్ మోదీ అరెస్ట్..

Hong kong can take decision on nirav modi s arrest china

Nirav Modi arrest, hong kong, Central Vigilance Commission (CVC), alarm, CBI, PNB scam, Fraud, Punjab National Bank, Nirav Modi, nirav modi-mehul choksi, cvc warning, cvc pnb, cvc jewellery, CVC, Banking, Business

China today said that Hong Kong can accede to India's request to arrest fugitive Indian diamond merchant Nirav Modi based on local laws and mutual judicial assistance agreements.

ప్లాష్.. ఫ్లాష్.. హాంకాంగ్ లో నిరవ్ మోదీ అరెస్ట్..

Posted: 04/09/2018 01:04 PM IST
Hong kong can take decision on nirav modi s arrest china

పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు యాక్సిస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు సహా పలు బ్యాంకులలో 13 వేల కోట్ల రూపాయల రుణాన్ని పొంది వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్ అయ్యాడు. ఆయనను హాంకాంగ్ లోని ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ విన్నవించిన పక్షంలో వారి వినతికి అనుగూణంగా హాంకాంగ్ స్థానిక చట్టాలకు లోబడి నీరవ్ మోదీని అరెస్ట్ చేసి విచారిస్తామని చైనా అధికార ప్రతినిధులు తెలిపారు.

హాంకాంగ్ లోని ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలోని పోలీసులు నిరవ్ మోదీని అదుపులోకి తీసుకున్నట్లుగా గతవారం భారత విదేశాంగ సహాయ మంత్రి వికే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. నిరవ్ మోదీ కుంభకోణాలు బయటపడకముందే ఆయన విదేశాలకు పారిపోయారు. ఆ తరువాత అమెరికా, లండన్ ఇలా పలు దేశాలలో నీరవ్ మోదీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల అతడు హాంకాంగ్‌లో ఉన్నాడని పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఉభయ దేశాల న్యాయ సహకారం ఒప్పందాల మేరకు మోదీని హాంకాంగ్ విచారిస్తుందని చైనా అధికారులు స్పష్టం చేశారు.

అలక్ష్యం చేసిన ఫలితమే..

కాగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ స్కామ్ బట్టబయటు అయ్యేందుకు సరిగ్గా ఏఢాది క్రితమే సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ అధికారులు బ్యాంకులను అప్రమత్తం చేశారు. అయితే వారి అలర్ట్ సంకేతాలను తేలిగ్గా తీసుకున్న క్రమంలోనే బ్యాంకుల్లో వరుసగా బంగారు, వజ్ర వ్యాపారుల కుంభకోణాలు వెలుగుచూశాయి. అయితే ఇందులో అత్యంత భారీ కుంభకోణమైన నిరవ్ మోడీకి సంబంధించిన మొత్తమే 13 వేల 600 కోట్లకు పైగా వుండటంతో సీవీపీ అధికారులు తాజాగా ఈ వివరాలను బయటపెట్టారు.  

2017 జనవరి 5న సెంట్రల్ విజిలెన్స్ అధికారులు ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో సీబీఐ సీనియర్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, 10 బ్యాంకులకు చెందిన చీఫ్ విజిలెన్స్ అధికారులు పాల్గోన్నారు. వారిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు తరపున కూడా ఓ ఉన్నతాధికారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వజ్రాలు, బంగారు అభరణాల రంగానికి ఇచ్చిన రుణాల్లో తీవ్ర అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్ అధికారులు బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. విన్సమ్ గ్రూపునకు చెందిన జతిన్ మెహతా చేసిన మోసాలపై చర్చించిన అధికారులు ఈ బంగారు, వజ్రాల రంగాల వారికి ఇచ్చిన రుణాలపై కూడా అలర్ట్ చేశారు.

అయినా బ్యాంకులు దీనిపై దృష్టి సారించలేదని, అందుచేతే అటు నిరవ్ మోడీ సహా ఈ రంగంలోని చిన్న వ్యాపారులు కూడా బ్యాంకులకు కుచ్చుటోపి వేశారని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. ఈ అంశమై ఆయన మాట్లాడుతూ... విన్సమ్ గ్రూపునకు చెందిన జతిన్ మెహతా బ్యాంకులకు చేసిన మోసాలపై తమ సమావేశంలో చర్చించామని, ఈ సందర్భంగా ఇతర జ్యుయలరీ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అవకతవకలపైనా చర్చించినట్టు చౌదరి చెప్పారు. లేని పక్షంలో పీఎన్బీ బ్యాంకులో మోదీ స్కామ్ అయన విదేశాలకు పరారీ కాకముందే వెలుగులోకి వచ్చేదని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  PNB scam  Fraud  Punjab National Bank  Nirav Modi  Gitanjali Gems  Gili India  CVC  Banking  Business  

Other Articles