Girls strip searched in madhya pradesh hostel సిగ్గు.. సిగ్గు.. విద్యార్థినుల బట్టలు విప్పించి.. మరీ తనిఖీలా..?

Girls strip searched after used sanitary pad found in hostel

Dr Hari Singh Gour University, girls strip searched in MP, sanitary pad in MP university hostel, Madhya Pradesh, Hostel, girls, stripped, Vice Chancellor, Hostel warden, sanitary pad, Rani Lakshmibai hostel, latest news

In a disturbing incident reported from MP university, a woman warden allegedly strip-searched 40 girl students after a used sanitary pad was found dumped in the hostel premises.

సిగ్గు.. సిగ్గు.. విద్యార్థినుల బట్టలు విప్పించి.. మరీ తనిఖీలా..?

Posted: 03/26/2018 04:44 PM IST
Girls strip searched after used sanitary pad found in hostel

వారంతా యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులే. అందులోనూ మెరిట్ మార్కులతో హాస్టల్ లో వుండి చదువుకునేందుకు అర్హతను సంపాదించిన వారే. హాస్టళ్లో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి చదువులు సక్రమంగా సాగేలా చూడాల్సిన ఓ వార్డెన్.. అత్యంత దారుణంగా వ్యవహరించి వారిని అవమానపర్చింది. మహిళై వుండి తోటి యువతుల పట్ల అమానవీయ చర్యలకు పాల్పడింది. హాస్టల్ అవరణలో వాడేసిన శానిటరీ ప్యాడ్‌  పడి ఉండటం చూసిన అగ్రహించిన వార్డెన్ విద్యార్థినులపై కనీసం మర్యాద కూడా లేకుండా దారుణంగా వ్యవహరించింది.

ఆ శానిటరీ ప్యాడ్‌ ఎవరిదో చెప్పాలంటూ అమ్మాయిలను నిలదీసింది. దీంతో వారు తమది కాదంటే తమది కాదని చెప్పడంతో.. ఎవరిదో తెలుసుకునేందుకు లోదుస్తులను పరిశీలించి పరాభవానికి ఒడిగట్టింది. వార్డెన్, అమె సహాయకురాలి చర్యలకు బెదిరిపోయిన విద్యార్థినులు యూనివర్శిటీ వైస్ ఛాన్సిలర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయకర ఘటన మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలోని  రాణి లక్ష్మీబాయి హాస్టల్‌ పరిధిలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్శిటీ ఆవరణలోని రాణి లక్ష్మీబాయి హాస్టల్‌ లో 40 మందికిపైగా విద్యార్థినులు ఉంటున్నారు. మార్చి24 హాస్టల్ ను తనిఖీచేసిన వార్డెన్‌ వాడిపారేసిన శానిటరీ ప్యాడ్‌ అవరణలో పడి ఉండటాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. అమ్మాయిలందరినీ వరుసలో నిలబెట్టి తన సహాయకురాలి సాయంతో వాళ్ల లోదుస్తులు విప్పించింది. దీంతో తీవ్ర అవమాన భారంతో వార్డెన్ ను, సహాయకురాలిని తొలగించాలంటూ యూనివర్శిటీ వీసీకి ఫిర్యాద చేశారు విద్యార్థినులు. ఈ సంఘటనను పరిశీలిస్తున్నామని, తప్పు చేసినట్లు తేలితే తీవ్ర చర్యలు తీసుకుంటామని సాగర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆర్‌పీ తివారీ తెలిపారు. ఘటనపై తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. దీనిపై ఇప్పటివరకు పోలీసు కేసు నమోదు కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles