pawan kalyan gets four police gunmen as security జనసేనాని పవన్ కు ప్రభుత్వ రక్షణ.. గన్ మెన్ల కేటాయింపు

Pawan kalyan gets four police gunmen as security

pawan kalyan, janasena, guntur, mangalagiri, security, gunmans, private security, left parties, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan gets gunmen for his security from government side, on his request to DGP on 14th march.

జనసేనాని పవన్ కు ప్రభుత్వ రక్షణ.. గన్ మెన్ల కేటాయింపు

Posted: 03/26/2018 11:40 AM IST
Pawan kalyan gets four police gunmen as security

రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన.. 2019లో జరగనున్న తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని కూడా ఇప్పటికే ప్రకటించిన క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచారు. గుంటూరులో ఈ నెల 14న నిర్వహించిన మంగళగిరి సభ అనంతరం ఆయన తనకు రక్షణ కల్పించాలని ఏకంగా ఏపీ డీజీపీని కోరారు. దీనిపై పదిరోజుల తరువాత నిర్ణయం తీసుకున్న పోలీసులు.. పవన్ కల్యాన్ కు భద్రత కల్పించేందుకు సిద్దమయ్యారు.

దీంతో ఇప్పటి వరకు తన వ్యక్తిగత ప్రైవేటు భద్రతా సిబ్బంది రక్షణ వలయం మధ్యలో వున్న జనసేనానికి ఇక ప్రభుత్వం రక్షణ కూడా అందుబాటులోకి రానుంది. ఇకపై సాయుధులైన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట అనుక్షణం ఉంటారు. ఈ మేరకు '2 ప్లస్ 2' విధానంలో నలుగురు సిబ్బందిని కేటాయిస్తూ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. పోలీసు శాఖకు చెందిన నలుగురు గన్ మెన్లను రెండు షిప్టుల్లో కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది.

జాతీయస్థాయిలో తృతీయ కూటమిపై పవన్ సమాలోచన

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ వద్దు.. రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ కూడా వద్దు.. అయితే జాతీయ స్థాయిలో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల స్పందించే ఒక గొంతు వినిపించాలని అది మనమే ఎందుకు కాకూడని, మనమే తృతీయ ఫ్రంట్ గా ఎందుకు ఏర్పడకూడదని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన అభిమతాన్ని వెల్లడించారు. ఇవాళ ఉదయం వామపక్షాలతో సమావేశమైన జనసేనాని తాజా రాజకీయ మార్పులు సహా పలు అంశాలపై చర్చిస్తూ, తన మనసులో ఉన్న థర్డ్ ఫ్రంట్ ఆలోచనను కూడా పంచుకున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర స్థాయి వామపక్షాల నేతలకు తన మనసులోని ఆలోచనను చెప్పిన పవన్ ఇలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎలా వుంటుందని తన అభిమతాన్ని చెప్పిన పవన్.. ఇదే విషయాన్ని జాతీయ నేతల వద్ద ప్రస్తావించి చూడాలని కూడా చెప్పారు. సిద్ధాంతాల పరంగా ఒకే భావజాలమున్న పార్టీలను ఏకం చేయాలని కూడా కోరారు. ఈ తృతీయ కూటమి బాధ్యతలను సీపీఐ, సీపీఎం పార్టీలకే అప్పగిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు కాంగ్రెస్ ఇటు బీజేపి దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. అయితే పవన్ అలోచనలపై వామపక్ష నేతల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచిచూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  guntur  mangalagiri  security  gunmans  left parties  andhra pradesh  politics  

Other Articles