Use tech to expose opposition's 'lies': PM Modi ప్రధాని మోడీ ప్లాన్ అదుర్స్.. ఒక్కోక్కరికి 3 లక్షలు..

Pm modi s mantra for 2019 polls win the hearts of party workers

narendra modi, bjp, bharatiya janata party, india news, india, lok sabha, lok sabha polls 2019, lok sabha elections 2019, narendra modi news, narendra modi 2019, bjp parliamentary meeting, amit shah, technology, bjp parliamentary meeting, social media, bjp news, india news

Ahead of the 2019 Lok Sabha polls, every political party seems to be focused on connecting with the common people, but for the Bharatiya Janata Party (BJP), it is the party workers who are the "priority".

ప్రధాని మోడీ ప్లాన్ అదుర్స్.. ఒక్కోక్కరికి 3 లక్షలు..

Posted: 03/24/2018 02:27 PM IST
Pm modi s mantra for 2019 polls win the hearts of party workers

బీజేపీ ఎంపీలకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపుసూత్రాలను ఫాలో కావాలని అందుకు ఇటు పేద, బడగువర్గాల ప్రజలతో కలసి వుండటంతో పాటు అటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశం ప్రసంగించిన ప్రధాని.. ఎంపీలందరూ తప్పనిసరిగా ట్విటర్ లో అధికారిక ఖాతాలు తెరవాలనీ అదేశించారు. ఒక్కో ఎంపీకి కనీసం మూడు లక్షలకు తగ్గకుండా ఫాలోవర్లు ఉండాలని సూచించారు.

ఈ అకౌంట్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న అబద్ధాలను ఎండగట్టేందుకు ఎంపీలంతా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మారుతున్న టెక్నాలజీని అనుకూలంగా ఉపయోగించుకుంటూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పనులు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై.. ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు వాస్తవాలు తెలియజేయాలని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టుకథలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని . దీన్ని తిప్పికొట్టేలని ఆయన చెప్పారు. మన సందేశం సామాన్య ప్రజలకు చేరాలని ప్రధాని మోదీ చెప్పినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.
 
సమకాలిక ప్రజాస్వామ్యంలో ఆన్‌లైన్‌లో ఓటర్లకు ఎలా దగ్గరకావాలో చెబుతూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. 2014 నుంచి ప్రభుత్వం సాధించిన విజయాలను అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలకు వివరించాలని కూడా ఎంపీలకు సూచించినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మొత్తం 43 మంది బీజేపీ ఎంపీలకు ఫేస్‌బుక్ ఖాతాలు లేవని తేలింది. ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్న వారిలో 77 మంది అకౌంట్లకు ఇంకా వెరిఫికేషన్ పూర్తికాలేదని గుర్తించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో పాటు ఎంపీలు తమ నియోజక వర్గాల్లో మీడియా సమావేశాలు నిర్వహించడం కూడా కీలకమేనని బీజేపీ సారధి అమిత్‌షా నొక్కిచెప్పినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles