Actress files rape complaint, businessman arrested హీరోయిన్ రేప్ కేసులో ముంబై వ్యాపారవేత్త అరెస్టు..

Mumbai businessman aman khanna arrested in actress alleged rape case

Zeenat Aman, Zeenat, Indian films, Indian people, Cinema of India, police officer, spokesperson, actress, U.S. Securities and Exchange Commission, Juhu Police Station, Sarfaraz Mohammed, Aman Khanna, Deepak Deoraj, Deputy Commissioner, Mumbai Police, Mumbai-based Businessman, Police (crime Branch) Nisar Tamboli, Crime

A Mumbai businessman Sarfaraz Mohammed, alias Aman Khanna, was arrested late from Versova and has been remanded to police custody till March 28, after Zeenat Aman, lodged a complaint accusing him of rape, cheating and forgery.

హీరోయిన్ రేప్ కేసులో ముంబై వ్యాపారవేత్త అరెస్టు..

Posted: 03/24/2018 10:10 AM IST
Mumbai businessman aman khanna arrested in actress alleged rape case

నిన్నటి తరం బాలీవుడ్‌ నటిపై అత్యాచారానికి పాల్పడిన ముంబై వ్యాపారవేత్తను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో నటి పోలీసులకు రెండు పర్యాయాలు పిర్యాదు చేయడం కదిలిన పోలీసులు ఎట్టకేలకు వ్యాపారవేత్త సర్పరాజ్ మహమ్మద్ అలియాస్ అమన్ ఖన్నాను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. దీంతో న్యాయస్థానం నిందితుడికి ఈ నెల 28 వరకు రిమాండ్ విదించిందని ముంబై క్రైం బ్రాంచ్ డిసీపీ నిస్సార్ తంబోలి తెలిపారు.

అమన్ ఖన్నా తనను ఆనయనకు చెందిన ఫ్లాటులో బంధించి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, గత కొద్ది రోజులుగా తన మొబైల్ కు అసభ్యకర ఫొటోలు పంపుతూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమె జూహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత జనవరిలో ఆమె అమన్ ఖన్నాపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ ఫిర్యాదులో కేవలం వేధింపులను మాత్రమే ప్రస్తావించారు. అయితే ఆ కేసును సిరీయస్ గా తీసుకోని పోలీసులకు అమె తనపై అత్యాచారం జరిపారని మరోమారు ఫిర్యాదు చేశారు.

బాలీవుడ్‌ లో ‘సత్యం శివం సుందరం’, ‘కుర్బానీ’, ‘అజ్‌ నబీ’ వంటి సినిమాలతో జీనత్‌ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. అనంతరం 1985లో మజార్‌ ఖాన్‌ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. వివాహానంతరం ఆమె నటనకు స్వస్థి చెప్పారు. 1998లో మజార్‌ మరణించడంతో ఇద్దరు కుమారులతో కలసి ఆమె ముంబైలోని జూహులో నివసిస్తున్నారు. మజార్ తో సన్నిహితంతో కుటుంబ స్నేహితులుగా ఎంతో అప్యాయంగా మెలిగిన అమన్ ఖన్నా.. అతని మరణం తరువాత మరీ ముఖ్యంగా 2011 నుంచి 2015 వరకు జీనత్ అమన్ నుంచి వ్యాపారాల నిమిత్తం ఏకంగా రూ. 15.4 కోట్లను తీసుకున్నాడు.

అయితే తన డబ్బు, బంగారు, వెండి అభరణాలను తిరిగి ఇవ్వాలని, అమె పలు పర్యాయాలు కోరినప్పటికీ.. అయన స్పందించలేదు. దీంతో ఇద్దరి మధ్య మరో ఒప్పందం జరిగింది. అమెకు గవర్నమెంటు కాలనీలోని నాలుగు ఫ్లాట్లతో పాటు శాంతాక్రూజ్ లోని మరో ఫ్లాటు ఇస్తానని నమ్మబలికి, వాటికి సంబంధించిన పోర్జరీ డాక్యుమెంట్లను అందించి మోసం చేశాడు. అంతేకాదు అమెను వివాహం చేసుకున్నట్లు (అలిఖాహ్నామా) నకిలీ డాక్యూమెంట్లు కూడా సృష్టించి అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు నిందితుడిపై పోలీసులు భారతీయ శిక్షా స్మృతి సెక్షన్లు 376, 420, 406, 465, 467, 468, 469, 471, 506 కింద కేసును నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zeenat Aman  rape case  Arrest  aman khanna  molestation  sexual assault  mumbai  crime  

Other Articles