ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదర్కోంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి 12 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ విధించింది ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం. దీంతో మాజీ కేంద్రమంత్రి తనయుడిని పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 24 వరకూ ఆయన తీహార్ జైలులోనే రిమాండ్ ఖైదీగా వుండనున్నారు. కాగా, జైలులో ప్రత్యేక సెల్ ఏర్పాటును కో్రుతూ కార్తి చిదంబరం తరపు న్యాయవాది యాయాన్ కృష్ణన్ వేసిన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో పాటు ఇంటి బోజనం వసతిని కల్పించాలని పిటీషన్ ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.
కాగా, పి. చిదంబరం కేంద్రమంత్రిగా వ్యవహరించిన సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తలదూర్చి లాభాలను అర్జించారన్న అరోపణలపే కార్తీ చిదంబరాన్ని విచారిస్తున్న సిబిఐ అయనపై అభియోగాలను నమోదు చేసి కోర్టులో సమర్పించిన నేపథ్యంలో కార్తీ చిదంబరానికి 12 రోజుల పాటు అనగా ఈ నెల 24 వరకు న్యాయస్థానం జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అయితే చిదంబరం కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో అనేక మంది ఉగ్రవాదాలను ప్రాసిక్యూట్ చేయడం జరిగిందని, దీంతో కార్తీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది దయన్ కృష్ణన్ కోర్టుకు విన్నవించారు.
కార్తీకి జైలులో ప్రత్యేక సెల్, ప్రత్యేక బాత్ రూమ్ కేటాయించాలని న్యాయస్థానాన్ని విన్నవిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. 'ముప్పు అనేది ఉంది. పిటిషనర్ (కార్తీ) కాంగ్రెస్ సభ్యుడు కూడా. అందువల్ల ఆయనకు జైలులో తగిన రక్షణ కల్పించాలి' అని కోరారు. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముప్పు అనేది చిదంబరానికి ఉండొచ్చు కానీ ఆయన కుమారుడికి కాదన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కార్తీ చిదంబరానికి ఎలాంటి ప్రత్యేక సెల్ కానీ, బాత్ రూమ్ కానీ, ఇంటి బోజన వసతినికి కానీ కల్పించేందుకు నిరాకరించింది. కాగా గత ఫిబ్రవరి 29న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీని అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more