After High Drama TDP Quitting Central Government | మోసం చేశారు.. రాజీనామాలు అన్న చంద్రబాబు, నిన్నంతా ఏం జరిగిందంటే...

Tdp bjp allaiance break up

BJP Government, Telugu Desam Party, Chandrababu Naidu, AP Special Status,

Attacking the BJP government for "betraying" Andhra Pradesh, Telugu Desam Party (TDP) on Wednesday decided to pull out two of its ministers in the central government, marking the first crack in the BJP-led coalition four years after it stormed to office with a massive mandate.TDP boss and AP chief minister Chandrababu Naidu announced that the two ministers would resign on Thursday. "We have taken the decision to pull out two TDP ministers, civil aviation minister P Ashok Gajapati Raju and Union minister of science and technology Srujana Chowdary, from the Union cabinet as all our efforts to get special category status failed. It was a last resort decision," he said.BJP ministers in the Andhra government are also Resigned Later.

మంత్రుల రాజీనామాలు.. కీలక పరిణామాలు

Posted: 03/08/2018 09:35 AM IST
Tdp bjp allaiance break up

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిసున్న తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య ఉన్న బంధం బద్దలైన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామాలను ఒక్కసారి గమనిస్తే...


* పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి చేస్తున్న నిరసనలను తెలుగుదేశం వైకాపా కొనసాగించాయి.
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎంపీలు గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు.
* ఆపై 11 గంటలకు లోక్ సభ ప్రారంభంకాగా, వివిధ పార్టీల ఎంపీల ఆందోళనతో నిమిషాల్లోనే వాయిదా పడింది
* ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జరుగగా పోలీసుల లాఠీచార్జ్ తో ఉద్రిక్త పరిస్థితి.
* ఏపీకి హోదా ప్రకటించే ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ వెల్లడి
* ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర వైఖరిపై గట్టిగా నిలదీత, కేంద్రం చేస్తున్న అన్యాయాలను ఇక భరించే ఓపిక లేదని హెచ్చరిక
* ఆపై సాయంత్రం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా లేదని, ప్యాకేజీకి కట్టుబడి ఉంటామని ప్రకటన. అది కూడా గతంలో ఇచ్చిన దానికి     లెక్కలు చెప్పిన తరువాతనేనని వెల్లడి
* జైట్లీ సమావేశం తరువాత ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్. కేంద్రం నుంచి వైదొలిగే విషయంలో ఏకాభిప్రాయం.
* ఆపై మంత్రులు, ముఖ్య నేతలతో మాట్లాడిన చంద్రబాబు. అందరిదీ ఒకే మాట.
* సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజుతో చంద్రబాబు ఫోన్ సంభాషణలు, పార్టీ ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న ఇద్దరు కేంద్ర మంత్రులు.
* రాత్రి 10.30 గంటలకు చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్. మంత్రుల రాజీనామాలపై ప్రకటన.
* రాత్రి 11 గంటలకు బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్... ఏపీలో తమ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాలు చేస్తారని ప్రకటించిన    విష్ణుకుమార్ రాజు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles