BJP MLA Free Advise to Hindus to Produce More Children | అప్పటిదాకా పిల్లల్ని కంటూనే ఉండండి.. హిందువులకు బీజేపీ ఎమ్మెల్యే సలహా

Bjp mla says hindus should produce more children

Uttar Pradesh, BJP, MLA Vikram Saini, Hindus, More Population, Controversial Comments, Vikram Saini, Vikram Saini Wife

BJP leader Vikram Saini urges Hindus to keep producing children until a law comes into effect, BJP MLA from Uttar Pradesh tells his wife also to keep Producing More Children.

బీజేపీ నేత మాట.. పిల్లల్ని కంటూనే ఉండండి

Posted: 02/24/2018 04:12 PM IST
Bjp mla says hindus should produce more children

బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. హిందువులు పిల్లల్ని కంటూనే ఉండాలంటూ ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

యూపీలోని ఖతౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ముజఫర్ నగర్ లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. జనాభా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సభ అది. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘ఇద్దరు పిల్లలు ముద్దు పాలసీ మనకు సమ్మతమే. కానీ, వేరే మతస్థులు దానిని పాటించటం లేదు. చట్టం అందరికీ సమానమే. అలాంటప్పుడు హిందువులూ పిల్లల్ని కనటం ఆపకూడదు. ఈ విషయంలో నా కుటుంబం కూడా అతీతం కాదు. మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. మూడో సంతానం ఎందుకని నా భార్య ప్రశ్నించింది. కానీ, నాకు నలుగురైదుగురు పిల్లలు కావాలని చెప్పా’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, విక్రమ్ కు వివాదాలేమీ కొత్త కాదు. గతంలో క్రిస్మస్, న్యూ ఇయర్ లు క్రైస్తవుల పండగలని.. ముస్లింలంతా పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

BJP MLA Vikram Saini

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles