Airtel launches Rs 9 plan with unlimited calls జియోను తలదన్నెలా ఎయిర్ టెల్ ఎంట్రీ లెవల్ ప్లాన్..

Airtel launches rs 9 plan with unlimited local std and roaming calls

airtel rs 9 recharge pack offer unlimited calls local std roaming airtel,airtel rs 9,airtel recharge,airtel plans,airtel subscriber,airtel tariff,best prepaid plans

The country's largest telecom operator has introduced a new entry-level prepaid plan to combat Reliance Jio's ultra-cheap offerings.

జియోను తలదన్నెలా ఎయిర్ టెల్ ఎంట్రీ లెవల్ ప్లాన్..

Posted: 02/16/2018 06:13 PM IST
Airtel launches rs 9 plan with unlimited local std and roaming calls

దేశీయ టెలికాం రంగ సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. మొన్నటికీ మొన్న మినిమమ్ రూపాయలతో నెలసరి వ్యాలిడిటీతో ఓ బ్రహ్మండమైన ప్లాన్ ప్రవేశపెట్టిన భారతీ ఎయిర్ టెల్ మరో రోజువారి ఆఫర్ ను ప్రకటించింది. రిలయన్స్ జియోను తలదన్నేలా వున్న ఈ ప్లాన్ కేవలం రూ.9కే అందించనుంది. రోజువారీ వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే ప్లాన్ రిలయన్స్ జియోలో రూ.19కి లభ్యం అవుతుండగా, భారతీ ఎయిర్ టెల్ మాత్రం అందులో సగం ధరకే సరికొత్త ఎంట్రీ లెవల్ రీచార్జ్ ప్యాక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ ప్యాక్‌లో భాగంగా ఒక రోజు కాలపరిమితితో అపరిమిత కాల్స్, 100 ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. ఎయిర్‌టెల్‌లో ఇప్పటికే రూ.23 ప్యాక్ ఉంది. ఈ రీచార్జ్ ప్యాక్‌లో ఖాతాదారులు రెండు రోజులపాటు అపరిమితంగా లోకల్/ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. 200 ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ రూ.9 ప్లాన్‌ను కంపెనీ మొబైల్ అప్లికేషన్ నుంచి కానీ, వెబ్‌సైట్ నుంచి కానీ పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. రిలయన్స్ జియో రూ.19 ప్యాక్‌లో వినియోగదారులకు ఒక రోజు కాలపరిమితితో అపరిమిత కాల్స్, 20 ఎస్సెమ్మెస్‌లు, 150 ఎంబీ డేటా లభిస్తుండగా ఎయిర్‌టెల్‌ రూ.9 ప్యాక్‌లో అపరిమిత కాల్స్‌తోపాటు 100 ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles