Modi is 'morally not fit' to be PM alleges siddaramaiah ‘‘ప్రధాని పదవికి మోడీ తగిన వాడే కాదు’’

Siddaramaiah hits back at modi says he is morally not fit to be pm

Yeddyurappa, Siddaramaiah, PM Modi, Karnataka elections, Karnataka Assembly polls, lokpal, lokayukta, gujarat, politics

Hitting back at Narendra Modi for his all-out attack on his Congress government, Karnataka CM Siddaramaiah accused him of telling a "tissue of lies" and said he was "morally not fit" to be PM.

‘‘ప్రధాని పదవికి మోడీ తగిన వాడే కాదు’’

Posted: 02/06/2018 09:02 AM IST
Siddaramaiah hits back at modi says he is morally not fit to be pm

సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నేపథ్యంలో ఆయన ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే విమర్శలను గుప్పిస్తున్నారు. ఇప్పటికే యోగా గురు బాబా రాందేవ్ బడ్జెట్ పై పెదవి విరయగా, అటు కేంద్రమంత్రి వైఎస్ చౌదరి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అవకాశం దొరికిందే తడవుగా విరుచుకుపడే పార్టీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా కూడా విమర్శలు గుప్పించారు.

రాజస్థాన్ లో జరిగిన రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, 'బ్రేకింగ్‌ న్యూస్‌: అధికార పార్టీకి విపత్కర ఫలితాలు వచ్చాయి. బీజేపీకి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్‌ నిలిచింది. అంటూ సొంతపార్టీకే షాకిచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రం కర్ణాటకలోనూ అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపి పార్టీల మధ్య మాటల యుధ్ధం కొనసాగుతుంది.

బిజెపి ప్రస్తావించిన అన్ని అంశాలపై అటు కాంగ్రెస్ సహా పలువురు సెలబ్రిటీలు కౌంటర్ ఇవ్వడంతో మరోమారు అధికారాన్ని అందుకుందామనుకున్న బీజేపికి అశలు అడియాలవుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రధాని మోడీ ర్యాలీపై, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు. అందరికీ అర్థం అయ్యే భాషలో సిద్ధూ ఇచ్చిన పంచ్ ల కర్నాటక బీజేపీని ఇరుకున పెడుతున్నాయి.

కర్ణాటకలో రాజకీయాలు విలువలతో చేయాలంటూ మోడీకి పంచ్ ఇచ్చారు. అది ఎలాగంటే అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. మోడీది ప్రధాని స్ధాయి కాదంటున్నారు సిద్దూ. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న 9 సంవత్సరాల్లో లోక్ యుక్త వ్యవస్థ లేదని.. అలాంటి వ్యక్తి కర్నాటకలో లోక్ పాల్ పై మాట్లాడటానికి అర్హత ఉందా అని నేరుగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులిచ్చారని తెగ ప్రచారం చేసుకుంటున్నారని, రాష్ట్రం నుంచి వెళ్లిన ట్యాక్స్ లే తిరిగి పంపిచారని లెక్కలతో బీజేపీకి చుక్కలు చూపించారు. మీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చి ఉంటే చెప్పడంటూ బీజేపీపై నేరుగా సెటైర్లు వేశారు.

కర్నాటక రాష్ట్రానికి 94వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం 84వేల కోట్లు మాత్రమే ఇచ్చారని.. అంటే మన కర్నాటక సొమ్మే మోడీ దగ్గర 10వేల కోట్లు ఉందంటూ చురకలు అంటించారు. ఇక అమిత్ షా ను ఓ మాజీ జైలు పక్షిగా వర్ణించారు. రాష్ట్రంలోని మరో జైలు పక్షి ఉందని.. ఈ ఇద్దరినీ అడవిలోకి పంపించాలంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు. మోడీ పర్యటన తర్వాత కూడా బీజేపీలో ఊపు కనిపించకపోగా.. కాంగ్రెస్ ఎదురుదాడి పెంచటంతో కమలం పార్టీలో కంగారు మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles