Man held on charges of raping teen inside theatre సినిమా థియేటర్లో ‘ఫేస్ బుక్‘ ఫ్రెండ్ పై అత్యాచారం..

Hyderabad 19 year old girl raped by facebook friend in theater

rape, hyderabad rape, rape in theater, rape in prashanth theater, rape on facebook friend, girl sexually assaulted, sexual assault in theater, sexual assault in prashanth theater, sexual assault in hyderabad theater, sexual assault in secundrabad theatre, hyderabad, secundrabad, telangana, crime

A man has been arrested for allegedly raping a 19-year-old girl inside a movie theatre, who became friends with the accused through social media, went to watch the film Padmaavat in Prashanth Theatre in Hyderabad.

సినిమా థియేటర్లో ‘ఫేస్ బుక్‘ ఫ్రెండ్ పై అత్యాచారం..

Posted: 02/02/2018 11:54 AM IST
Hyderabad 19 year old girl raped by facebook friend in theater

సామాజిక మాద్యమంలో పరిచయాలు కాస్తా.. అమ్మాయిల పాలిట శాపాలుగా మారుతున్నాయి. సాంకేతిక విప్లవంతో ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చిందనుకుని సంబరపడే లోపు నేరాలు కూడా అదేస్థాయిలో జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకెళ్లి.. సినిమా హాలులోనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు కామాంధుడి ఘటన అలస్యంగా వెలుగుచూసింది.

నగరంలోని ప్రశాంత్ థియేటర్ లో జరిగిన ఈ ఘటనపై మార్కెట్ పోలీసులు కథనం ప్రకారం... జనగాం జిల్లా నెర్మెట్టకు చెందిన భిక్షపతి జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతితో ఫేస్ బుక్ ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. ఇంటర్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న యువతితో భిక్షపతి ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు.

జగద్గిరిగుట్టలో ఉండే చెల్లెలు ఇంటికి తరచూ వచ్చే భిక్షపతి.. రెండు పర్యాయాలు నగరానికి వచ్చినప్పుడు యువతని కూడా కలుసుకున్నారు. అలాగే గత నెల 28న నగరానికి వచ్చిన భిక్షపతి ఆమెతో కలిసి పలు ప్రాంతాల్లో తిరిగాడు. 29న మరోమారు ఇద్దరు కలిసి ఇందిరాపార్కుకు వెళ్లి, అక్కడ నుంచి ప్రశాంత్‌ థియేటర్లో పద్మావతి సినిమా చూసేందుకు వచ్చారు. సినిమా హాలులో కేవలం 70 మంది ప్రేక్షకులే వున్నారని గమనించిన బిక్షపతి యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు.

యువతికి రక్తస్రావం కావడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, దీంతో థియేటర్ వద్దకు వచ్చిన అమె కుటుంబసభ్యులు యువతి పరిస్థితిని చూసి గుండలవిసేలా ఏడ్చారు. అదే రోజు మార్కెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bikshapathi  cinema hall  facebook  friends  padmavat  Hyderabad police  Rape  prashanth theater  crime  

Other Articles