Telangana Deputy CM Hospitalized | కుప్పకూలిన టీ డిప్యూటీ సీఎం.. ఆస్పత్రిలో చేరిక

Telangana deputy hospitalised

Telangana, Deputy Chief Minister, Mohammad Ali, Jubilee Hills, Apollo Hospital, Deputy CM Mohammad Ali, Mohammad Ali Hospitalized

Telangana Deputy Chief Minister Mohammad Ali Hospitalised with Chest Pain. Family Members Admitted him in Apollo Hospital Jubilee Hills. Now Mohammad Ali Condition Stable.

తెలంగాణ డిప్యూటీ సీఎంకు తీవ్ర అస్వస్థత

Posted: 02/02/2018 09:33 AM IST
Telangana deputy hospitalised

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి సేవలు అందిస్తున్నారు. గుండె రక్తనాళాలు రెండు మూసుకుపోయినట్టు వైద్యులు వెల్లడించారు.

రాత్రి 8 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని, నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. అలీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles