'Srinivas Reddy's murder is political killing: Komati Reddy ఇది రాజకీయ హత్యే: కోమటిరెడ్డి

Srinivas reddy s murder is political killing komati reddy

Komatireddy Venkat Reddy, pre-planned murder, Nalgonda Municipal Chairperson Lakshmi, chairperson's husband brutal murder, TRS activists, srinivas reddy murder, congress, gunmen, CM KCR, nalgonda, crime

Nalgonda MLA Komatireddy Venkat Reddy responding to the brutal killing of Nalgonda Municipal Chairperson's husband said it is a pre-planned murder and added that a few are saying that TRS activists were behind the killing.

శ్రీనివాస్ రెడ్డిది రాజకీయ హత్య: కోమటిరెడ్డి

Posted: 01/25/2018 09:51 AM IST
Srinivas reddy s murder is political killing komati reddy

తన ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురికావడంతో తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బోరున ఏడ్చారు. నిన్న రాత్రి హత్య జరిగిన వార్తను తెలుసుకున్న ఆయన ఇవాళ హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గోండకు వచ్చారు. ఘటనాస్థలానికి వెల్లిన ఆయన శ్రీనివాస్ ను చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన భార్య లక్ష్మీ సహా కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రణాళికాబద్దంగా చేసిన దారుణ హత్య అని అరోపించారు. ఈ హత్యవెనుక టీఆర్ఎస్ నేతల హస్తం వుందని పలువురు అరోపిస్తున్నారని కూడా అరోపించారు. తనకు కుడిభుజంగా వున్న శ్రీనివాస్ ను ఓ పథకం ప్రకారం హత్య చేసినట్లు అరోపించారు. గతంలోనే శ్రీనివాస్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయని, దీంతో ఏదో కుట్ర జరుగుతుందని ముందుగానే పసిగట్టి.. సీఎం కేసీఆర్ వద్దకు వీరిని తీసుకెళ్లి.. గన్ మెన్లతో రక్షణ కల్పించాలని కోరినా అయన పట్టించుకోలేదని అన్నారు. ఇక స్థానిక పోలీసులు అక్కడి వ్యవస్థను రౌడీవ్యవస్థగా మార్చడంపై కూడా కోమటిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ దారుణ హత్య :

నల్గొండ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యారు. తన నివాసం సమీపంలోనే ఆయన హత్యకు గురయ్యారు. నల్గొండలోని సావర్కర్ నగర్ లో కుటుంబంతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఘర్షణపడ్డారు. ఈ విషయంలో స్థానిక కౌన్సిలర్‌ కుమారుడు మెరగు గోపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఘర్షణ సద్దుమణగలేదు.

దీంతో గోపి, శ్రీనివాస్‌ కు ఫోన్‌ చేసి విషయం వివరించగా, ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్‌ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరగింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ తలపై బండరాయితో మోది హత్య చేసి, పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసిన నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. దీంతో పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Komatireddy Venkat Reddy  TRS activists  srinivas reddy murder  congress  gunmen  CM KCR  nalgonda  crime  

Other Articles