Rajinikanth's plunge may catapult Stalin to CM job రజనీకాంత్ రాణించలేడా..? సర్వే తేల్చిన నిజం..!

India today opinion poll says rajinikanth party gets 33 seats

MK Stalin, karunanidhi, Stalin, Rajya Sabha, Rajinikanth, Rajini, kamal hassan, panneruselvam, india today survey, India Today-Karvy, mid term polls, R K Nagar, Jayalalithaa, Edappadi K Palaniswami, DMK, AIADMK, tamil nadu

After Actor Rajinikanth announcement of floating a political party and contest all the assembly seats in the election scheduled for 2021, an opinion poll gave his yet-to-be-named party 33 seats in the 234-member assembly with 16% vote share.

రజనీకాంత్ రాణించలేడా..? సర్వే తేల్చిన నిజం..!

Posted: 01/18/2018 10:29 AM IST
India today opinion poll says rajinikanth party gets 33 seats

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వైపు దేశంలోనే ప్రముఖ నటులుగా ఖ్యాతిని సొంత చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయ పార్టీలను స్థాపించి.. 2021లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో తలపడేందుకు తాము సిద్దమని ఇప్పటికే ప్రకటించడంతో... రాజకీయ ఈక్వేషన్లు శరవేగంగా మారుతున్నాయి.

ఇప్పటికే అమ్మ నిచ్చెలి, చిన్నమ్మగా పేరొందిన శశికళ అన్నాడీఎంకే పార్టీని చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు..ఒకింత విజయవంతంగా కాగా, అమె ఎత్తులకు పైఎత్తులు వేసిన అధికారపక్షం అమెను చిత్తు చేసి కటకటాల్లోకి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తొలుత రెండు తరువాత మూడు ఆ తరువాత మళ్లి రెండువర్గాలుగా చీలిపోవడం తెలిసిందే. ఇటీవల జరిగిన అర్కే నగర్ ఎన్నికలలో కూడా శశికళ మేనల్లుడు దినకరణ్ గెలుపోందారు. దీంతో జయలలిత మరణం నుంచి ఒక రకంగా తమిళనాడులో రాజకీయ అనిశ్చిత నెలకొందని చెప్పక తప్పదు.

తమిళనాడు ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్ది.. రాష్ట్ర సర్వోతముఖాభివృద్దికి దోహదపడే రాజకీయ నాయకులు కావాలన్న కాంక్షను ఇన్నాళ్లుగా వ్యక్తం చేసిన రజనీకాంత్.. అమ్మ మరణం తరువాత మాత్రం ఈ నేతను తానే ఎందుకు కాకూడదని ప్రశ్నించుకున్నట్లు వున్నారు. దీంతో తాను రాజకీయ పార్టీని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇటు తమిళనాడుతో పాటు యావత్ దేశంలో సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా వుంటుందన్న విషయమై ఇండియా టుడే-కార్వీ సంస్థ నిర్వహించింది. అయితే ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే డీఎంకే అధికారంలోకి వస్తుందని సర్వే తేల్చింది. అంతేకాదు.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావమో ఏమో తెలియదు కానీ.. రజనీకాంత్ పార్టీకి కేవలం 33 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.

దీంతో రజనీకాంత్ రాజకీయాలలో రాణించగలడా..? అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతువున్నాయి. అయితే ఎంట్రికీ ముందుకు అందరి పరిస్థితి ఇంతేనని, అరంగ్రేటం చేసిన తరువాత పరిస్థితులే వారినిన రాటు తేలేనా చేస్తాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాగా జయలలిత మరణం తరువాత రాజకీయ శూన్యత ఆవరించిందని 65 శాతం మంది అభిప్రాయపడగా, అన్నాడీఎంకేది ఇక చరిత్రేనని మోజరిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే అన్నాడీఎంకేకు దూరమైన వారిలో 60 శాతం మంది రజనీకాంత్‌వైపు, 26 శాతం మంది డీఎంకేవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక స్టాలిన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles