Vangaveeti Radha to join ruling TDP Party..? టీడీపీ గూటికి చేరనున్న వంగవీటి రాధ..?

Vangaveeti radha to join ruling tdp party

chandrababu vangaveeti ranga, TDP vangaveeti ranga, vangaveeti radha TDP, vangaveeti radha to join tdp, vangaveeti radha ycp, vangaveeti radha gowtham reddy, vangaveeti radha ys jagan, vangaveeti radha kapu leader, vangaveeti radha vijayawada, andhra pradesh

In a big political gain, YSRCP senior leader Vangaveeti Radha to join ruling TDP Party after chandrababus arrival from foreign tour..?

బెజవాడలో ఫ్యానుకు ఎదురీత.. సైకిల్ ఎక్కనున్న రాధ..?

Posted: 01/17/2018 11:14 AM IST
Vangaveeti radha to join ruling tdp party

ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లి తమ వాణిని వినిపిస్తూ.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ పాదయాత్ర చేస్తున్న విపక్ష నేత వైఎస్ జగన్ కు అంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన విజయవాడలో మాత్రం ఎదురుదెబ్బ తగలనుందా..? ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కాపు సామాజిక వర్గ ప్రతినిధి వంగవీటి రాధ త్వరలో అధికార టీడీపీ పార్టీలో చేరనున్నారా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పుడిదే బెజవాడలో రాజకీయంగా సంచలన చర్చనీయాంశంగా మారింది.

కాపుల అభున్నతి కోసం పాటుపడిన వంగవీటి రంగా రాజకీయ వారుసుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ అరంగ్రేటాన్ని ప్రారంభించిన రాధ.. ఆ తరువాత పీఆర్పీలోకి వెళ్లినా.. చివరకు వైసీపీ పార్టీలోనే వుంటానని.. వైఎస్ జగన్ వెంటే నడుస్తానని స్వతహాగా ప్రకటించారు. అయితే ఆ పార్టీకి చెందిన గౌతమ్ రెడ్డి ఇటీవల వంగవీటి రంగాపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో.. రాధ ఈ మేరకు తన నిర్ణయాన్ని తీసుకున్నారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

టీడీపి సీనియర్ నేతలు వంగవీటి రాధతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం ఇవాళ బెజవాడ సహఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైపోయిందని టీడీపీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం టీడీపీలోకి రాధ చేరిక ఉంటుందని కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకుగాను రాధ షరతును కూడా టీడీపీ వర్గాలు స్వాగతించి, సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాయని సమాచారం.

తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు సిద్దమని రాధ వర్గాలు షరుతు పెట్టగా దానికి అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకుందని, దీంతో ముఖ్యమంత్రి దావోస్ పర్యటన పూర్తికాగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఇదే క్రమంలో వైసీపి నుంచి మరింత మంది నేతలు టీడీపీలోకి రానున్నారని సమాచారం.

రాధ చేరికతో కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ, పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లే ప్రస్తావించారట రాధ. వంగవీటి రాధ టీడీపీలో చేరితే, కృష్ణా జిల్లాతో పాటుగా కోస్తా జిల్లాల్లోని పలు నియోజిక వర్గాలపై దాని ప్రభావం వుంటుందని, దీంతో ఆయా ప్రాంతాల్లో విపక్ష పార్టీకి రానున్న ఎన్నికలలో ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  vangaveeti ranga  vangaveeti radha  tdp  ycp  jagan  kapu leader  vijayawada  andhra pradesh  

Other Articles