Chandrababu ays sorry to common man సామాన్యుడు షాక్ అయ్యేలా.. చంద్రబాబు అసమాన్యకార్యం..

Andhra pradesh cm chandrababu naidu says sorry to common man

Andhra Pradesh Chief Minister, Chandrababu sorry, chandra babu surprise, chief minister sorry to common man, chandrababu traffic jam, chandrababu grievances, chandrababu Naravaripalle, chandrababu Chittoor, chandrababu family naravaipalle

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu surprised everyone by saying sorry to common man, who was stuck in traffic jam caused by him.

ITEMVIDEOS: సామాన్యుడు షాక్ అయ్యేలా.. చంద్రబాబు అసమాన్యకార్యం..

Posted: 01/17/2018 09:48 AM IST
Andhra pradesh cm chandrababu naidu says sorry to common man

పండుగ పర్వదినాన.. తన సొంతూరికి వెళ్లి అక్కడే తన కుటుంబ సభ్యలతో వేడుకలను జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి మాత్రం ఓ అనన్యసామాన్యమైన పని చేశాడు. ఏకంగా రాజకీయ విమర్శకుల చేత కూడా శబాష్ అనిపించుకున్నాడు. అదేంటి.. అంటారా..? ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఓ సామాన్య యువకుడిని గ్రామప్రజల సాక్షిగా క్షమాపణలు కోరడమే. వినడానికే అశ్చర్యంగా వున్నా ఇది ముమ్మాటికీ నిజం. సామాన్యులు షాకయ్యేలా వున్నా ఈ వార్తే ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది.

నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించి.. తిరిగి వస్తూ రోడ్డు పొడవునా బారులు తీరిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దీంతో పోలీసులు అటుగా వాహనాల రాకపోకలను నిలిపేశారు. అదే సమయంలో పులిచెర్ల మండలం దిగువమూర్తిపల్లెకు చెందిన నవీన్ కుటుంబసభ్యులతో కలిసి రంగంపేట నుంచి నడుచుకుంటూ నారావారిపల్లెకు వచ్చి బస్సు కోసం ఎదురుచూస్తూ ఇబ్బంది పడ్డాడు. ఎంతకీ బస్సులు రాక అసహనం వ్యక్తం చేసి.. అక్కడున్న వారిని ప్రశ్నించాడు.

అక్కడే వున్న చంద్రబాబు నవీన్ ను చూసి దగ్గరకు పిలిచి ఏం జరిగిందని విచారించాడు.. దీంతో యువకుడు బదులిస్తూ రెండు గంటలుగా వాహనాలను నిలిపివేశారని, పండుగ పూట ఇలా ఇళ్లకు పోనివ్వకుండా రోడ్డుపై బస్సులు ఆపేయడం ఏమీ బాగోలేదని.. చిన్నపిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారని, కళ్లు తిరిగి పడిపోయేలా ఉన్నారని అవేదన వ్యక్తం చేయడంతో చలించిన చంద్రబాబు.. ‘‘అయామ్ సారీ అమ్మా, ఇకపై అలా జరగదు. ఎస్పీకి చెబుతాను’’ అంటూ సముదాయించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించారు. చంద్రబాబు సారీ చెప్పడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయేలా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  sorry  comman man  Traffic jam  police officials  andhra pradesh  

Other Articles